twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిని కించ పరిచే సినిమాలు చేయొద్దు: బాలకృష్ణ

    By Bojja Kumar
    |

    ''మంత్రం బ్రాహ్మణాదీనం.. దైవం మంత్రాదీనం, ఆపరేషన్‌ వైద్యుడే చెయ్యాలి.. ఆలయ పూజ అర్చకుడే చెయ్యాలి.. భక్తి బ్రాహ్మణుల వృత్తి.. అది భగవంతుడు వాళ్లకిచ్చిన శక్తి' అంటూ బ్రాహ్మణుల గురించి 'జై సింహ' చిత్రంలో గొప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు బాలకృష్ణతో పాటు చిత్ర బృందాన్ని సన్మానించారు.

    జ్ఞాన సంపదలో బ్రాహ్మణున్ని...వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని

    జ్ఞాన సంపదలో బ్రాహ్మణున్ని...వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని

    ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.... ‘నేను జ్ఞాన సంపదలో బ్రాహ్మణున్ని, ఐశ్వర్యంలో వైశ్యున్ని, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకున్ని, నాయీ బ్రాహ్మణున్ని, కల్లు గీత కార్మికున్ని, కల్మషం లేని యాదవున్ని, ఆపదలో ఆదుకునే వెలమను, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని.... అన్ని కులాలు ఆదరించే సినిమా ‘జై సింహ' అని బాలయ్య తెలిపారు.

    Recommended Video

    ఫిల్మ్ స్టూడియో ప్లాన్ చేస్తున్న బాలయ్య.. ఎక్కడో తెలుసా ?
     రామానుజాచార్యగా నటిస్తా

    రామానుజాచార్యగా నటిస్తా

    ‘‘ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ బ్రాహ్మణుడుగా పుట్టే అవకాశం రాదు. వాళ్ల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ‘జై సింహ' సినిమాలో సన్నివేశాలుండటం సంతోషంగా ఉంది. రామానుజాచార్యులు అంతా సమానమే అని చెబుతూ, చాపకూటి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అష్టాక్షరి మంత్రాన్ని కూడా రాసి ప్రచారం చేశారు. నా అరవైయవ ఏట ఆయన పాత్రలో సినిమా చేస్తాను'' అని బాలయ్య తెలిపారు.

     బ్రాహ్మణులను కించపరిచే సినిమాలు చేయొద్దు

    బ్రాహ్మణులను కించపరిచే సినిమాలు చేయొద్దు

    ఇక నుండి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలను తీయకూడదు. అందరికీ ఉపయోగపడే విధంగా వుండాలి. ఎవరినీ అవమానించకూడదు అని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు.

     నాన్నగారి జీవిత సారాంశం

    నాన్నగారి జీవిత సారాంశం

    తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాన్నగారి జీవిత సారాంశాన్ని తీసుకుని 'యన్‌.టి.ఆర్‌.' సినిమాని తీస్తున్నాం. మహానుభావుడైన ఆయనకి కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మసుకృతమని ఈ సందర్బంగా బాలయ్య తెలిపారు.

     మన తెలుగు వాళ్లకి ఘన చరిత్ర ఉంది

    మన తెలుగు వాళ్లకి ఘన చరిత్ర ఉంది

    మన తెలుగు వాళ్లకి ఘన చరిత్ర ఉంది. వందేళ్ల కిందటే గండి విశ్వనాథశాస్త్రిని జర్మనీవాళ్లు కిడ్నాప్‌ చేసి వేదసారాంశాన్ని తెలుసుకొని సాంకేతికంగా ఎదిగారు. ఇప్పటికి కూడా ఆయన ఫొటో అక్కడ రాయబార కార్యాలయంలో ఉంది. అలాంటి చరిత్ర మనది. అదంతా వెలుగులోకి రావడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తోంది. తొలి తెలుగు రాజ్యం శాతవాహనులది. ఆ చరిత్ర ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి' తీశామని బాలయ్య తెలిపారు.

    English summary
    Balakrishna anbd Jai Simha Movie Team Felicitation by Brahmins. In one of the crucial scenes, Balakrishna describes the importance of temple priests which received breathtaking response from fans. And now, a Brahmin association responded on Balayya's praises on Brahmins. The association lauded Balayya for vocalizing precious words on Brahmins.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X