»   »  ‘బ్రహ్మోత్సవం’తో మహేష్ బాబు మరో రికార్డ్!

‘బ్రహ్మోత్సవం’తో మహేష్ బాబు మరో రికార్డ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు సినిమా విడుదలైతే చాలు ఏదో ఒక రికార్డు. ఆయన సినిమా హిట్టయినా, ప్లాపయినా ఏదో ఒక విషయంలో రికార్డు క్రియేట్ చేయడం కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపకపోయినా.... మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది.

యూఎస్ఏ మార్కెట్లో 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్ 1 మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. మహేష్ బాబు సినిమాలు యూఎస్ఏ లో 1 మిలియన్ వసూళ్లు సాధించడం అనేది ఈ మధ్య చాలా సర్వ సాధారణం అయిపోయాయి. 'బ్రహ్మోత్సవం' సినిమాతో ఆ సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటి వరకు ఏ సౌతిండియా హీరోకు సంబంధించిన ఇన్ని సినిమాలు యూఎస్ఏలో 1 మిలియన్ మార్క్ అందుకోలేదు.


ఇప్పటి వరకు మహేష్ బాబు నటించిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వన్, ఆగడు, శ్రీమంతుడు యూఎస్ఏలో 1 మిలియన్ మార్కు అందుకోగా, ఇపుడు బ్రహ్మోత్సవం కూడా ఆ లిస్టులో చేరి పోయింది. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి 19 సినిమాలు ఈ ఫీట్ సాధించగా....అందులో 6 సినిమాలు మహేష్ బాబు నటించినవే కావడం విశేషం.


బ్రహ్మోత్సవం యూఎస్ఏ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. $1,019,293 డాలర్లు వసూలు చేసింది. గురువారం వేసిన ప్రీమియర్ షోల ద్వారా $560,274, శుక్రవారం $245,960, శనివారం $171,680, ఆదివారం $37,226. నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు రోజు రోజుకు దారుణంగా పడిపోయిన వైనాన్ని మీరు గమనించ వచ్చు. సినిమా మంచి టాక్ ఉంటే ఆదివారం వసూళ్లు అదిరిపోయేవి. కానీ నెగిటివ్ టాక్ కారణంగా ఆ రోజు కేవలం $37,226 మాత్రమే వసూలు చేసింది. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రం 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు లేవని అంటున్నారు.


వన్ మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన సినిమాల సంఖ్య విషయంలో మహేష్ బాబు తర్వాత ఎవరున్నారో స్లైడ్ షోలో...


మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు 6 సినిమాలతో టాప్ పొజిషన్లో ఉన్నారు.


ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ చెరొక మూడు సినిమాలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.


బన్నీ, నాగ్, నాని

బన్నీ, నాగ్, నాని


అల్లు అర్జున్, నాగార్జున,నానిలకు సంబంధించి రెండేసి సినిమాలు ఉన్నాయి.


ప్రభాస్, వెంకటేష్

ప్రభాస్, వెంకటేష్

ప్రభాస్, వెంకటేష్ లకు సంబంధించి చెరొక సినిమా ఉన్నాయి.


ఖాతా తెరవలేదు

ఖాతా తెరవలేదు

స్టార్ హీరోలుగా ఉన్న రామ్ చరణ్, బాలయ్యలు ఇప్పటి వరకు 1 మిలియన్ ఖాతా తెరవలేక పోయారు.
English summary
'Brahmotsavam' crossed $1 million-mark in USA by the end of First Weekend. Its the 6th film in Mahesh Babu's career to join the million dollar club
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu