For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బ్రహ్మోత్సవం'‌ సెట్‌లో : సూపర్ స్టార్ ని కలిసిన స్టార్ ఫొటోగ్రాఫర్ (ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్‌: మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. 'బ్రహ్మోత్సవం' సెట్‌ తారలతో సందడిగా ఉంటోంది. మొన్నటికి మొన్న బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ సెట్‌కు వచ్చి చిత్రబృందాన్ని ఆశ్చర్యానందానికి గురి చేస్తే.. ఇప్పుడు యువ హీరో వరుణ్‌ ధావన్‌ సెట్‌కు వచ్చి సందడి చేశాడు. తాజాగా స్టార్ ఫొటోగ్రాఫర్ అవిగోవర్ కర్ వచ్చి మహేష్ తో ముచ్చటించి వెళ్లారు. ఆయన ప్రస్తుతం షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న 'దిల్‌వాలే', టీమ్ తో పనిచేస్తున్నారు.

  mahesh

  చిత్రం షూటింగ్ లేటెస్ట్ అప్ డేట్స్...

  . ఈ చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఆ కుటుంబానికేంటండి... ఎప్పుడూ బ్రహ్మోత్సవంలా వెలిగిపోతుంటుంది అంటుంటారు ఆ వూళ్లోవాళ్లు. అంత సందడిగా ఉంటుంది ఆ ఇల్లు. ఈ రోజూ అదే పరిస్థితి. అందుకే ఆ ఇంట్లో ఏమవుతుందా అని చూస్తే.. మహేష్‌బాబు, రేవతి, తనికెళ్ల భరణి ముచ్చట్లు పెట్టుకున్నారు. అది చూస్తే ఆ ఇల్లు నిత్యం కళకళలాడడానికి కారణం ఇదేనేమో అనిపిస్తుంది. ఆ వెంటనే సీన్‌ అయిపోయినట్లుంది కట్‌.. సూపర్‌ అంటూ తర్వాతి సీన్‌ కోసం సిద్ధమైపోయారు దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల.

  మరిన్ని విశేషాలు...

  ఈ చిత్రం ఏప్రియల్ 7,2016న విడుదల చేయటానికి నిర్ణయంచినట్లు సమాచారం. అలాగే మార్చి నెలాఖరకు చిత్రానికి సంభందించిన అన్ని పనలు పూర్తి చేయాలని దర్శక,నిర్మాతలు ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుంద''న్నారు.

  ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్‌.వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు.

  srikanth addala

  మహేష్ బాబు ఇక తన దృష్టంతా బ్రహ్మోత్సవం సినిమాపై పెట్టనున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేయటంతో అభిమానులు ఆనందోత్సాహాలల్లో నిమగ్నమయ్యారు.

  గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, రేవతి, జయసుధ, నరేష్ లు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

  సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి

  English summary
  Superstar Mahesh meets star photographer Avigowariker on Brahmotsavam sets! He also did a photoshoot with Dilwale team!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X