»   »  నిర్మాతల సైడ్ బిజినెస్: ‘బ్రహ్మోత్సవం’ పేరుతో చెప్పుల వ్యాపారం!

నిర్మాతల సైడ్ బిజినెస్: ‘బ్రహ్మోత్సవం’ పేరుతో చెప్పుల వ్యాపారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య విడుదలైన 'బ్రహ్మోత్సవం' పోస్టర్లో మహేష్ బాబు ఎవరికో చెప్పులు తొడుగుతున్న ఫోటో రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో నిర్మాతలకు ఓ కత్తిలాంటి ఐడియా తట్టినట్లుంది. సైన్ ఇన్ కం కోసం చెప్పుల వ్యాపారానికి అనుమతి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేసినట్టున్నారు. ఇపుడు బ్రహ్మోత్సం పోస్టర్లతో పాటు చెప్పుల బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు.

ఇలా చేయడం ద్వారా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీతో పాటు... ఆయా సంస్థల నుండి నిర్మాతకు అనదనపు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ కాన్సెప్టు మాత్రం కొందరు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సినిమా ప్రమోషన్స్ అంటే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలే తప్ప....ఇలా ప్రకటనలను జోడిస్తూ విసుగు తెప్పించడం ఏం బాలేదు అని అంటున్నారు. మరి సైడ్ ఇన్ కం కోసం నిర్మాతలు చేస్తున్న ఈ చెప్పుల బిజినెస్.... సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

నిన్న మొన్నటి వరకు సినిమాలోని జీవితానికి ఉపయోగపడే డైలాగులు, రొమాంటిక్ డైలాగులతో పోస్టర్లు రిలీజ్ చేసారు. వీటిని చూసిన ప్రేక్షకులు ప్రమోషన్స్ చాలా డిఫరెంటుగా ఉన్నాయి అంటూ మెచ్చకున్నారు. అయితే చెప్పుల బిజినెస్ ప్రమోషన్స్ చూసిన తర్వాత మాత్రం కొందరు నొచ్చుకోవడం కనిపించింది.

శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో మహేష్ బాబు, సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 20 సినిమా రిలీజ్ కానున్నాయి.

స్లైడ్ షోలో బ్రహ్మోత్సవం చెప్పుల బిజినెస్ ప్రమోషన్స్...

చెప్పుల ప్రమోషన్స్

చెప్పుల ప్రమోషన్స్


సినిమాలో హీరో చెప్పులు తొడిగే సీన్ ఉంది కాబట్టి చెప్పుల బిజినెస్ ప్రమోషన్స్ కి తెరలేపారు.

ప్రమోషన్స్

ప్రమోషన్స్


ప్రమోషన్స్ అంటే ప్రేక్షకులు మెచ్చుకునే విధంగా ఉండాలని, ఇక్కడ కూడా యాడ్సే చూడాలా అని నొచ్చకునేలా కాదని అంటున్నారు.

యూనిక్ ప్రమోషన్స్ ఓకే

యూనిక్ ప్రమోషన్స్ ఓకే


ఇలా యూనిక్ గా నిర్వహిస్తున్న ప్రమోషన్స్ చూసి ప్రేక్షకులు ముచ్చట పడుతున్నారు. కానీ చెప్పులు, ఇతర యాడ్స్ చాటు ప్రమోషన్స్ చూసి ముక్కు విరుస్తున్నారు.

మంచి మాటలు

మంచి మాటలు


సినిమా ప్రమోషన్స్ అంటే ఇలా మంచి మాటలతో ఉంటే ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు.

సూపర్

సూపర్


మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

English summary
Hot topic about Brahmotsavam movie footwear promotions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu