For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బ్రహ్మోత్సవం' , 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాఫ్ ఈ రెండు సినిమాలకు కలిసొచ్చింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : పెద్ద సినిమాలు డిజాస్టర్ అవటం ఓ రకంగా ఇండస్ట్రీకి లాస్. ఎందుకంటే...డబ్బు రొటేషన్ తిరగటం తగ్గిపోతుంది. నష్ట పోయిన డిస్ట్రిబ్యూటర్స్ ...ఉత్సాహంగా మార్కెట్లో ఉన్న మిగతా సినిమాలపై పెట్టుబడి పెట్టరు. ఇన్విస్టిమెంట్స్ బ్లాక్ అయ్యిపోతాయి. కానీ హిట్ అవటం, ఫ్లాఫ్ అవటం ఎవరూ కావాలని చేయరు కాబట్టి ఎవరినీ ఎవరూ నిందించలేదు. కేవలం లాస్ లు రికవరీ చేసుకుంటూ డ్యామేజ్ ఎంత తక్కువలో తగ్గించాలని చూడటమే చేయగలిగింది.

  ఈ వేసవిలో వచ్చిన పవన్ ...సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం, మహేష్..బ్రహ్మోత్సవం చిత్రం రెండూ డిజాస్టర్ అయ్యాయి. రెండు సినిమాలు మినిమం కూడా వెనక్కి తెచ్చుకోలేక డిస్ట్రిబ్యూటర్స్ కు బారీ లాస్ తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు ఫ్లాఫ్ కావటంతో ఎగ్జిబిటర్స్ కూడా పెద్ద దెబ్బే. బారీగా జనం వస్తారని ఎక్సెపెక్ట్ చేసిన సినిమాలు ఆడకపోతే...కొత్త సినిమాలు కోసం వేట మొదలెట్టాలి. అలాంటి పరిస్దితే సరైనోడుకు, బిచ్చగాడు కు బాగా కలిసివచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

  సర్దార్ ఫ్లాఫ్ కావటంతో వెంటనే సీన్ లోకి సరైనోడు చిత్రం వచ్చింది. సినిమా బాగున్నా...సర్దార్ తో నిరాశపడ్డ మెగాభిమానులకు ఎక్కువ ఊరట కలిగించింది. అలాగే ఈ సినిమాకు మంచి ధియేటర్స్ దొరకే అవకాసం వచ్చింది. అఫ్ కోర్స్ సరైన ధియేటర్స్ లేకపోతే మరి కొద్ది రోజులు ఆపేవారు అల్లు అరవింద్. అయితే సర్దార్ ప్రక్కకు తప్పుకోవటంతో సరైనోడు చించి ఆరేసింది. సినిమాలో విషయం ఉండటమే కాకుండా , మార్కెట్లో జనం వెళ్లటానికి మరో సినిమా లేకపోవటం కూడా కలిసి వచ్చింది.

  సరిగ్గా అలాంటి సిట్యువేషనే ..బిచ్చగాడు కు జరిగింది. మీరు గమనిస్తే... నిజానికి విజయ్ ఆంటోని అనే తమిళ హీరో లేదా మ్యూజిక్ డైరక్టర్ తెలుగువారికి పరిచయం బాగా తక్కువ. ఆయన డబ్బింగ్ సినిమాలు నకిలి, సలీం పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఆయన తెలుగు రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు వెల్ నోన్ పర్శన్ అయ్యిపోయారు. ఎందుకంటే ఆయన బిచ్చగాడు చిత్రం హిట్టవంటతో.

  బిచ్చగాడు చిత్రం ఎంత పెద్ద హిట్ అంటే ...మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవటంతో ఆ సినిమాని తీసేసి చాలా ధియేటర్లలలో వేసేటంత. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ లతో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావటం బిచ్చగాడు హిట్ అవటం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.

  Brahmotsavam’s loss Bichagadu’s gain

  తమిళంలో హిట్టైన పిచ్చైకారన్ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని తెలుగులో రిలీజ్ చేసిన చదలవాడ కేవలం యాభై లక్షలుకు తీసుకున్నారు. తర్వాత కోటిన్నర వరకూ పబ్లిసిటీపై ఖర్చు పెట్టారు. ఇప్పుడీ చిత్రం 13 కోట్లు వసూలు చేసి రికార్డ్ లు క్రియేట్ చేసింది.

  ట్రేడ్ వర్గాలు ఈ విషయాలని విశ్లేషిస్తూ...బ్రహ్మోత్సవం ఫ్లాఫ్ కావటమే ఈ సినిమాకు ఇంత పెద్ద హిట్ అవటానికి కలిసి వచ్చింది అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మోత్సవం హిట్ అయ్యి ఉంటే బిచ్చగాడు కు సరైన ధియేటర్స్ దొరికేవి కాదు.

  నిర్మాత మాట్లాడుతూ.."మేము మొదటి వారంలో బిచ్చగాడు సినిమాని కేవలం యాభై నుంచి అరవై ధియేటర్స్ మాత్రమే దొరకటంతో విడుదల చేసాం. రెండోవారం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవటంతో చాలా ధియేటర్స్ లో మా సినిమాని రీప్లేస్ చేసారు. నేను బ్రహ్మోత్సవం కు వచ్చిన నెగిటివ్ టాక్ తో ఇలా చేసారనటం లేదు. కేవలం బిచ్చగాడు కంటెంట్ బాగుండటమే కారణం అంటున్నా ను," అన్నారు. నాలుగోవారంలో కూడా ఈ సినిమా అదరకొట్టే కలెక్షన్స్ తో నడుస్తోంది అన్నారు.

  English summary
  While films of many big stars have bombed recently, the dubbed film Bichagadu is going great guns. Initially Bichagadu released the film in just 50 to 60 screens in the first week. After the second day of Brahmotsavam, Bichagadu film replaced it in many theatres.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X