»   » థియేటర్‌లో తొక్కిసలాట, లాఠీ ఛార్జ్‌

థియేటర్‌లో తొక్కిసలాట, లాఠీ ఛార్జ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు : అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో నగరంలోని నర్తకి థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుంది. బృందావన సినిమా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో హీరో దర్శన్‌ ఆదివారం థియేటర్‌ను సందర్శించారు. దర్శన్‌ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా తోసుకొచ్చారు.వారిని అదుపు చేయలేక పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈసయమంలో గాజుపలకలు ధ్వంసం అయ్యాయి. ఇక ఈ చిత్రం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బృందావనం చిత్రం రీమేక్ కావటం విశేషం. అక్కడ బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.

రాధ కూతురు కార్తీక ఈ కన్నడ చిత్రంలో చేసింది. సినిమా పేరు 'బృందావన'. దర్శన్‌ హీరో. ముక్త మరో హీరోయిన్ గా చేసింది. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. కార్తీక మాట్లాడుతూ-''తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన 'బృందావనం' చిత్రానికి రీమేక్‌ ఇది. క్రాంతి వీర సంగోళి రాయ న్న...చిత్రంతో ఘనవిజయం అందు కున్న హీరో దర్శన్‌ సరసన నటించే అవకాశం రావడం అదృష్టం'' అంది.

Brindavana

ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'బృందావనం'. తెలుగులో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తమిళంలోనూ రీమేక్ కానుంది. ప్రముఖ స్టార్ హీరో, రాజకీయవేత్త విజయ్‌కాంత్ ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కుల్ని పొందారు. విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్‌ను హీరోగా పరిచయం చేస్తూ విజయ్‌కాంత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తమిళ స్టార్ డైరక్టర్ ఒకరికి ఈ రీమేక్‌కు భాధ్యత అప్పగించనున్నట్లు సమాచారం. తెలుగులో హీరోయిన్స్ గా నటించిన సమంతా, కాజల్ స్థానంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంకా నిర్ణయం కాలేదు. ఇక జూ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన బృందావనం చిత్రం ఇక్కడ మంచి విజయం సాధించింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్ కోసం చాలా మంది నిర్మాతలు ట్రై చేసినట్లు సమాచారం.

ఇక గత కొంతకాలంగా తెలుగు చిత్రాల రీమేక్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హిందీ,తమిళ భాషలవారు ఎప్పటికప్పుడు ఇక్కడ చిత్రాలను రీమేక్ చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో పోకిరి రీమేక్ హిట్టైన దగ్గర నుంచి వారు ఇక్కడ రిలీజయ్యే చిత్రాల పై ఓ కన్నేసి ఉంచుతున్నారు. తమిళ హీరోలైతే ఇక్కడ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రోజున ఎంక్వైరీ చేసుకుంటున్నారు. హిట్ టాక్ వస్తే వెంటనే తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన హీరోల చిత్రాలు అక్కడ ఒకేసారి రిలీజవుతున్న నేపధ్యంలో రీమేక్స్ తగ్గే అవకాశం ఉంది.

English summary
Challenging star Darshan is back again with Brindavana. The actor, who is basking in the success of his previous movies - Sarathee, Kranthiveera Sangolli Raayanna and Bulbul, is all set to give fourth Blockbuster hit with this movie!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu