»   » మొన్న సెక్సీ ఐటం సాంగ్..ఇప్పుడు సెంటిమెంట్ సాంగ్ (వీడియో)

మొన్న సెక్సీ ఐటం సాంగ్..ఇప్పుడు సెంటిమెంట్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్షయ్ కుమార్ తాజా బాలీవుడ్‌ చిత్రం బ్రదర్స్‌ కి చెందిన వీడియో సాంగ్ లను వరస పెట్టి విడుదల చేస్తున్నారు. మొన్న కరీనా కపూర్ హాట్ ఐటం సాంగ్ ని విడుదల చేసిన టీమ్ తాజాగా ఓ సెంటిమెంట్ కూడిన పీల్ సాంగ్ ని వదిలింది.. ఈపాట ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. అందిరి ప్రశంసలూ పొందుతోంది. ఆ పాటను మీరు ఇక్కడ చూడండి.

ఈ చిత్రం 2011లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం 'వారియర్‌'కి రీమేక్‌. ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, అక్షయ్‌ కుమార్‌, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఇటీవల సాంగ్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించిన నిర్మాతలు తాజాగా పూర్తి సాంగును రిలీజ్ చేసారు. సూపర్ హాట్ లుక్ తో కరీనా కపూర్ ఆకట్టుకుంటోంది. సాంగ్ సినిమాకు మరింత ప్లస్ అవడంతో యూత్ ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. ఆ సాంగ్ పైనా ఓ లుక్కేయండి

ఇంతకు ముందు 'దబంగ్-2'లో ఫెవికాల్ సాంగ్ లో చిందేసి కనువిందు చేసిన కరీనా కపూర్ , ఈ సారి కూడా తనదైన పంథాలో పసందు చేయనుంది. అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన బ్రదర్స్‌ చిత్రంలో ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌ కీలకమైన పాత్రలో నటించారు. ముగ్గురూ ఈ చిత్రంలో చిరుగడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు.

English summary
Now, Sapna Jahan song from Brothers was released after the sensational song ‘Mere Naam Mary’. Thiఅంs Sapna Jahan was the soulful melody which touch the bottom of the hearts. In this Sapna Jahan, Akshay Kumar and Jacqueline Fernandez was awesome and they lived in the song,Sapna Jahan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu