twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రూస్ లీ: ఈ సారైనా రామ్ చరణ్ ఖాతా తెరుస్తాడా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు సినిమాలు ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ బిజినెస్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఉండే యూఎస్ఏ మార్కెట్ టాలీవుడ్ సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. పెద్ద హీరోల సినిమాల ఇక్కడ వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి భారీ లాభాలు పొందుతున్నారు నిర్మాతలు.

    మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్ల సినిమాలు ఇక్కడ మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేస్తుంటాయి. ఇటీవల యంగ్ హీరో నాని కూడా ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో 1 మిలియన్ డాలర్ మార్కు అందుకున్నాడు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇప్పటి వరకు యూఎస్ఏ మార్కెట్లో 1 మిలియన్ మార్కు అందుకోలేదు. ఆయన సినిమాలో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు అదగొడుతున్న చరణ్ సినిమాలు యూఎస్ఏలో మాత్రం అనుకున్న వసూళ్లు సాధించలేక పోతున్నాయి.

    Bruce Lee eyeing in million mark

    దీంతో చెర్రీకి యూఎస్ఏ మార్కెట్లో 1 మిలియన్ డాలర్ వసూళ్లు ఇప్పటికీ అందని దాక్షగానే మిగిలిపోయింది. అయితే ఈ సారి ఎలాగైనా ‘బ్రూస్ లీ' సినిమాతో 1 మిలియన్ మార్కు వసూళ్ల అందుకుని సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నాడు. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.

    రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు.

    డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Ram Charan is one actor who has not tasted the one million mark collections yet in the US. Even though his previous films have collected superb amounts in India, overseas figures were quite normal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X