»   » ‘బ్రూస్ లీ’ నష్టాలు: డబ్బు వెనక్కి ఇచ్చే ప్రశ్నే లేదన్న నిర్మాత

‘బ్రూస్ లీ’ నష్టాలు: డబ్బు వెనక్కి ఇచ్చే ప్రశ్నే లేదన్న నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం ‘బ్రూస్ లీ'. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ నష్టాలను మిగిల్చింది. సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ. 10 కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు పరిహారం అడుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ రూమర్లపై ‘బ్రూస్ లీ' నిర్మాత డివివి దానయ్య స్పందించినట్లు తెలుస్తోంది. పరిహారం ఇవ్వడం, డబ్బు తిరిగి ఇవ్వడం అనే ప్రశ్నే లేదు. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారనేది అవాస్తవం. అయినా వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి సహజం. ఇలాంటి రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నట్లు సమాచారం.

Bruce Lee producer said 'NO Compensation'

తమిళంలో సూపర్ హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ‘థాని ఓరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఎన్వీ ప్రసాద్, డివివి దానయ్య కలిసి నిర్మించాలని అనుకున్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డివివి దానయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ స్థానంలో అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇటీవల రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' నిర్మించిన దానయ్య ఆ సినిమా సరిగా ఆడక పోవడంతో ఫైనాన్షియల్ గా టైట్ పొజిషన్లో ఉన్నట్లు టాక్. అందుకే ‘థాని ఓరువన్' సహ నిర్మాతగా తప్పుకున్నట్లు చెబుతున్నారు.

English summary
Bruce Lee producer DVV Danayya confirmed that there is no question of any such thing like 'compensation' or return of money. Also he stated that no distributor has lost big chunks of money and whatever the loss incurred is a thing of business and there is nothing to worry about.
Please Wait while comments are loading...