For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిడ్ నైట్ 2 గంటలకు: షారూఖ్ ఖాన్, రామ్ చరణ్ హంగామా

  By Srikanya
  |

  హైదరాబాద్ : రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన 'బ్రూస్‌లీ' సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం పనులు వేగవంతం చేసారు. ‘బ్రూస్ లీ' సినిమా చివరి దశ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గత రెండు రోజులుగా ఏ మాత్రం గ్యాప్ లేకుండా రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ సింగ్ లపై ‘లీ లీ బ్రూస్ లీ' సాంగ్ ని షూట్ చేసారు.

  ఈ రోజు ఉదయంతో ఆ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఈ సాంగ్ షూట్ జరుగుతున్న టైంలో వీరికి ఓ సర్ప్రైజ్ కలిగింది. అదే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్రూస్ లీ సెట్స్ ని విజిట్ చేయడం. ప్రస్తుతం రోహిత్ శెట్టి డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న దిల్ వాలే సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది.

  Finally #BruceleeTheFighter shooting wrapped .thank every unit member for the hardwork they put-in .

  Posted by Ram Charan on 6 October 2015

  ఈ సందర్భంగా షారుఖ్ తన షూటింగ్ పూర్తి చేసుకున్నాక చరణ్ సెట్లోకి వచ్చాడు. అలా అక్కడ అందరినీ పలకరించిన షారుఖ్ రామ్ చరణ్ తో కాసేపు పిచ్చాపాటి మాట్లాడటమే కాకుండా రామ్ చరణ్ స్టెప్స్ ని బాగా ఎంజాయ్ చేసాడట.

  రాత్రి 2 గంటల వరకు చరణ్ తో పాటు సెట్లో ఎంజాయ్ చేసి తర్వాత షారుఖ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడట .రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాని అక్టోబర్ 16న రిలీజ్ చెయ్యడానికి ఎక్ష్త్రా టైం షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

  Bruce Lee :SRK midnight hungama on Bruce Lee sets
  ఈ చిత్రానికి ఇప్పటికే రావాల్సినంత క్రేజ్ వచ్చేసింది. చిరంజీవి గెస్ట్ రోల్ లో కనిపించటం అనే వార్త, శ్రీను వైట్లతో తొలిసారి చేయటం, ఇప్పటికే వదిలిన ట్రైలర్స్ సినిమా బిజినెస్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేసాయి. దాంతో ఈ చిత్రం అన్ని ఏరియాలు అమ్ముడయ్యి...పదికోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో రామ్ చరణ్, నిర్మాత, దర్శకుడు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ గత చిత్రం ఆగడు ప్రభావం ఈ సినిమా బిజినెస్ పై కొంచెం కూడా పడలేదని అర్దమవుతోంది.

  రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ 3 నిమిషాల పాటు కనిపించి అభిమానులను ఎంటర్టెన్ చేయనున్నారు.


  చిరంజీవి మాట్లాడుతూ...బ్రూస్‌లీలో తన పాత్ర గురించి అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. బ్రూస్‌లీ సినిమాలో తన ఎంట్రీ కొస మెరుపు లాంటిదని చిరంజీవి అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పాలంటే సంపూర్ణంగా భోజనం చేసిన తర్వాత ఒక స్వీటు తిన్నట్టు ఉంటుందన్నారు. తమకు ఇన్‌స్పిరేషన్ అభిమానులేనని చెప్పారు. సినిమా ఎలాగు రిలీజ్‌కు దగ్గరకు వచ్చింది కాబట్టి సినిమాలోని డైలాగ్ చెప్పడానికి వెనుకాడనని ఒక డైలాగ్ చెప్పారు. బ్రూస్‌లీలో రామ్‌చరణ్ కొట్టిన బాస్ మీ స్టెమినోను, మీ స్పీచ్‌ను అందుకోలేను బాస్ అనే డైలాగ్‌ను చెప్పారు.

  రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారని చెప్తున్నారు. ఈ సినిమా ప్రారంభానికి ముందు స్టంట్స్‌ గురించి బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నాడు చరణ్‌. కథ రీత్యా ఈ సినిమాలో కొత్త తరహా ఫైట్లు చేసినట్లు సమాచారం.

  రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  English summary
  Last night, the sets of Bruce Lee saw lot of activity with Shah Rukh Khan enjoying the song they are filming. He interacted with Charan and the crew till the wee hours of 2 am.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X