»   »  ‘బ్రూస్ లీ’ సెన్సార్ పూర్తి....రిలీజ్ వాయిదా కుదరదు!

‘బ్రూస్ లీ’ సెన్సార్ పూర్తి....రిలీజ్ వాయిదా కుదరదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రం ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు.

రుద్రమదేవి సినిమా విడుదలైన వారం గ్యాపుతోనే ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలైతే కష్టం అవుతుందని, విడుదల వాయిదా వేసుకోవాలని నిర్మాతల విజ్ఞప్తి చేసారు. అయితే ఇప్పటికే ‘బ్రూస్ లీ' సినిమా విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావడంతో సినిమాను వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పినట్లు సమాచారం.


రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రూస్ లీ'. బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.


 BruceLee-TheFighter Censor report

రామ్ చరణ్ హీరోగా కావడం, శ్రీను వైట్ల దర్శకత్వం, మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఇలా సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.


రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
BruceLee-TheFighter censor completed and is awarded with U/A certificate. Decks are clear for a grand release on 16 October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu