»   » కొత్త సింగర్స్ కు 'బెంగాల్ టైగర్' భలే ఆఫర్

కొత్త సింగర్స్ కు 'బెంగాల్ టైగర్' భలే ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రవితేజ హీరోగా రూపొందుతున్న 'బెంగాల్‌టైగర్' చిత్రం డిసెంబరు 10న సందడి చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు ఒక పోటీ నిర్వహిస్తున్నారు.

బెంగాల్ టైగర్ సినిమాలో తమకిష్టమైన పాటను యువ గాయనీ గాయకులు పాడి ‘సౌండ్ క్లౌడ్'లో అప్ లోడ్ చేసి తమ వివరాల్ని అందులో పొందుపరచాలి. ఈ ట్రాక్స్ లోంచి మూడింటిని సంగీత దర్శకుడు భీమ్స్ ఇతర జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు.


Bumper offer to singers from 'Bengal Tiger'

ఆ పాటలు పాడిన సింగర్ లను బెంగాల్ టైగర్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో సత్కరించడంతో పాటు క్యాష్ ప్రైజ్ అందజేస్తారు. అంతే కాదు.. భీమ్స్ సంగీతమందించబోయే తర్వాతి సినిమాలో వారికి పాటలు పాడే అవకాశం కూడా లభిస్తుంది.ఈ విషయమై దర్శకుడు సంపత్ నంది చేసిన ట్వీట్ చూడండి.నిర్మాత కేకే రాధా మోహన్ మాట్లాడుతూ-'' మా చిత్రంలోని ఐదు పాటల్లో ఏదో ఒక పాటను పాడి SOUNDCLOUD లో అప్‌లోడ్ చేసి srisatyasaiarts@gmail.comకు పంపించాలి. వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఈ నెల 30న జరగనున్న ఆడియో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో బహుమతులను నటీనటులతో అందజేయిస్తాం'' అని తెలిపారు.

''ఈ ముగ్గురిలో బెస్ట్ సింగర్‌ను ఎంపిక చేసి భీమ్స్‌తో నేను చేయబోయే మరో చిత్రంలో పాట పాడే ఛాన్సిస్తా. ఈ నెల 28 వరకు ఎంట్రీలను స్వీకరిస్తాం'' అని 'బెంగాల్ టైగర్' దర్శకుడు సంపత్‌నంది చెప్పారు.English summary
Bengal Tiger Producer Radha Moham announced, “We request film buffs to sing one of the songs from our film and upload it to soundcloud with their details. Three lucky winners will be felicitated by the lead actors of the film and will be given a cash prize during the platinum disc function. One of these winners will also get an opportunity to croon for music composers Bheem’s next film.”
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu