»   » ‘బన్నీ అండ్ చెర్రీ’ మూవీ లోగో ఆవిష్కరణ

‘బన్నీ అండ్ చెర్రీ’ మూవీ లోగో ఆవిష్కరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రిన్స్, మహత్ హీరోలుగా మల్టీ డైమన్షన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై రూపొందుతున్న సినిమాకు 'బన్నీ అండ్ చెర్రీ' అనే టైటిల్ ఖరారు చేసారు. రాజేష్ పులి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత మారుతి, రచయిత యండమూరి వీరేంద్రనాథ్, తేజ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైన ట్రైలర్ ఆవిష్కరించారు. వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్టులో సాగే కామెడీ సినిమా అని మల్టీ డైమన్షన్ సుధీర్ బాబు తెలిపారు.

Bunny and Cherry

యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ...'30 ఏళ్ల క్రితం తులసీదళం కథ రాసాను. అదే విధమైన కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైంటిఫిక్ మూవీ ఇది. ఇందులో నేను కూడా మంచి రోల్ చేసాను. ఇంతకు ముందు తెలుగు తెరపై రానటువంటి కథతో తెరకెక్కుతోంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...చాలా మంది కథ విని డిస్కరేజ్ చేసారు. మల్టీ డైమన్షన్ వాసుగారు నా సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్‌తో సపోర్ట్ చేసారు. వారంలో పాటలు విడుదల చేసి, నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం. ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపారు.

బ్రహ్మానందం, సుమన్, చంద్రమోహన్, యండమూరి వీరేంద్రనాథ్, పోసాని కృష్ణ మురళి, ఎల్బీ శ్రీరామ్, సీత, ఎస్వీఆర్, జీవా, గౌతం రాజు, సత్తెన్న, అపూర్వ, దువ్వాసి మోహన్, శశాంక్, కిషోర్, రాజు, టార్జాన్, గుండు హనుమంతరావు, మేల్కోటి తదితరులు నటించారు. సంగీతం : శ్రీ వసంత్, కెమెరా : రవికుమార్, డైలాగ్స్ : గిరీష్ కిరణ్, ఎడిటింగ్ : మోహన్ రావు, రామారావు, ఆర్ట్ : గోవింద్, పాటలు : భాస్కరభట్ల, శ్రీమణి, పొత్తూరి రవికుమార్, కరుణాకర్, ఫైట్స్ : రమణ, కథ-దర్శకత్వం : రాజేష్ పులి.

English summary
The young actors Prince and Mahat starrer upcoming movie “Bunny And Cherry” is in the postproduction process. Rajesh Puli is the director while it is being produced by Rajath Parthasarathi under Multidimensional Pvt Ltd banner.
Please Wait while comments are loading...