»   » బన్నీ ఇంట్లో స్వతంత్ర దినోత్సవం: జండా ఎగరేసిన అల్లు అర్జున్

బన్నీ ఇంట్లో స్వతంత్ర దినోత్సవం: జండా ఎగరేసిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ ఇంటి దగ్గర 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. తన కుటుంబంతో కలిసి జెండా ఎగరేశాడు బన్నీ. గీతాఆర్ట్స్ కార్యాలయంలో అల్లుఅరవింద్ సమక్షంలో జెండాను ఎగురవేశారు. ఈ విషయాన్ని గీతాఆర్ట్స్ వారి ఫేస్‌బుక్ ద్వారా తెలియజేస్తూ ఫోటోలు పోస్ట్ చేశారు.

దేశ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో బన్నీ స్వచ్ఛందంగా పాల్గొనడం ఆయన అభిమానులను సంతోషపెడుతోంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను గీతా ఆర్ట్స్‌ సంస్థ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. కేవలం కార్యాలయంలోనే కాకుండా బన్నీ తన నివాసంలో కూడా జాతీయ జెండాను ఎగురవేసినట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు వారు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో బన్నీ భార్య స్నేహా రెడ్డి, కుమారుడు అయాన్, కుమార్తె అర్హ కూడా పాల్గొనడం విశేషం.

Bunny hoists national flag

దేశభక్తి మెండుగా ఉన్న కథానాయకుడు అల్లు అర్జున్. పంద్రాగస్టు వచ్చిందంటే ఆయన తప్పకుండా జెండా వందనం కార్యక్రమంలో పాల్గొంటుంటాడు. రెండేళ్ల క్రితం పంద్రాగస్టుని పురస్కరించుకొని ఐయామ్ దట్ ఛేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ ని నిర్మించడంతో పాటు అందులో నటించాడు కూడా. ఆ రకంగా తన దేశభక్తిని చాటడమే కాకుండా సమాజంపట్ల తనకున్న బాధ్యతని కూడా నిర్వర్తించాడు. ఇటీవల హరితహారంలో కూడా తన కుటుంబంతో కలిసి పాల్గొన్నాడు.

Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
English summary
Hero Allu Arjun hoisted national flag at his house on the occasion of 70th independence day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu