»   »  పవన్ అంటే ఇష్టం..., ఆ పిచ్చి వల్లే ‘బర్నింగ్ స్టార్’

పవన్ అంటే ఇష్టం..., ఆ పిచ్చి వల్లే ‘బర్నింగ్ స్టార్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'హృదయ కాలేయం' సినిమాతో బర్నింగ్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న 'బందిపోటు' సినిమాలో హీరో స్నేహితుడిగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని బొమ్మనరాజ్‌కుమార్ తోటలో సాగుతోంది. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు తన గురించిన పలు విషయాలు చెప్పుకొచ్చారు.

Burning star Sampoornesh Babu interview

తన స్వస్థలం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం మిట్టపల్లి అని తెలిపారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. 'హృదయకాలేయం' సినిమా దర్శకుడు స్టీవెన్‌శంకర్ పరిచయంతో ఆ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటుడిగా జన్మనిచ్చింది స్టీవెన్‌శంకర్ అయితే..జీవం పోసింది మీడియా సోదరులే అని చెప్పుకొచ్చారు.

మొదటి నుంచి మోహన్‌బాబు గారంటే చాలా ఇష్టం. అలాగే పవన్‌కళ్యాణ్, కన్నడ హీరో ఉపేంద్ర. వీరి నటన, స్టైల్ చాలా ఇష్టం అన్నారు. హీరోగానే కాకుండా ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తా. మంచి నటుడిగా స్థిరపడాలనుంది. త్వరలో 'కొబ్బరిమట్ట' సినిమాలో హీరోగా చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు ఒప్పుకున్నాను. బందిపోటులో అల్లరి నరేష్ స్నేహితుడిగా గుర్తింపు ఉన్న పాత్రలో నటిస్తున్నాను అన్నారు.

English summary
Check out Sensational Hero and burning star Sampoornesh Babu Special Interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu