»   » పవన్ స్పీచ్‌పై సంపూ.. కొత్త లుక్‌తో అదరగొట్టిన బర్నింగ్ స్టార్

పవన్ స్పీచ్‌పై సంపూ.. కొత్త లుక్‌తో అదరగొట్టిన బర్నింగ్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా తెరకెక్కుతున్న కొబ్బరిమట్ట చిత్రం కోసం కొత్తగా ఉన్న గెటప్‌‌ను సంపూర్ణేష్ బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. న్యూలుక్‌లో సంపూ అదరగొట్టాడు. కొత్త లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ఈ ఫొటోను రీట్వీట్ చేశారు.

అమెరికాలో పవన్ స్పీచ్‌పై సంపూ కామెంట్స్

అమెరికాలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పందించాడు. కడుపు నిండిన నాయకుడికి, కడుపు మండిన నాయకుడికి ఉన్న తేడా అదేనని పవన్ స్పీచ్‌పై ట్వీట్ చేశాడు.


ఏపీ ప్రత్యేక హోదాపై బర్నింగ్ స్టార్ ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరుగుతున్న దీక్షపై తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఏపీలో మూడు రోజులుగా జరుగుతున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఏపీలో జరుగుతున్న దీక్షను పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.


ఏపీకి సంపూ మద్దతు

ఏపీ ప్రత్యేక హోదా కోసం వైజాగ్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమానికి మద్దతు తెలిపాడు. స్వయంగా వైజాగ్‌కు వెళ్లి ర్యాలీలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా సంపూను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


సంపూకు ఏపీలో పెరుగుతున్న ఆదరణ

సంపూకు ఏపీలో పెరుగుతున్న ఆదరణ

తెలంగాణకు చెందిన సంపూ ఏపీ ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమానికి మద్దతు తెలుపడం చర్చనీయాంశమైంది. సంపూ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఏపీకి చెందిన సినీనటులెవ్వరూ మద్దతివ్వని సమయంలో సంపూ ప్రత్యేక హోదాపై గళాన్ని వినిపించడాన్ని ఆ ప్రాంత ప్రజలు స్వాగతించారు.


English summary
Burning star Sampoornesh Babu commented on Pawan Kalyan speech at America. He tweeted his comments with his new look for Kobbarimatta.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu