»   » పాక్ నటుల సినిమా కోసం 350 చెక్ ఇచ్చాడు : కరణ్ జోహార్ కి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదు

పాక్ నటుల సినిమా కోసం 350 చెక్ ఇచ్చాడు : కరణ్ జోహార్ కి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఉరీ ఉగ్రదాడి అనంతరం పాక్ నటుల విషయంలో ముందుగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన సీరియస్ అయ్యింది. బాలీవుడ్ లో ఉన్న పాక్ నటులంతా 48గంటల్లో సర్ధుకుపోవాలని హెచ్చరించింది. అయితే ఈ విషయంపై అప్పట్లో కరణ్ జోహార్... తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరించాడు. పాక్ నటులతో తీసిన సినిమా విడుదలకు సన్నాహాలు చేసుకున్నాడు. అయితే తాజాగా థియేటర్ల యజమానులు కూడా కరణ్ జోహార్ సినిమాని విడుదల చేయనివ్వమని చెప్పడంతో కాళ్ల బేరానికి వచ్చిన కరణ్... ఇక మీదట తాను పాకిస్థానీ నటీనటులతో సినిమాలు చేయబోనని ప్రకటించాడు. ఇదే సమయంలో తనతో 300 మందికిపైగా భారతీయులుకూడా పనిచేస్తున్నారని తన దేశభక్తిపై ఒక హింట్ వదిలాడు.

A businessman Karan Cheena has been creating a lot of waves on the social media circuit. Cheena has sent a written letter to Karan Johar along with a cheque of Rs. 320. in the letter, he has cited that he has no interest in watching Johar’s film whatsoever but as a fellow businessman, he is concerned about the director’s losses

అయినా కూడా త‌న మిత్రుల సూచ‌న మేర‌కు ఈ మూవీని తీయ‌డానికి ఉన్న ప‌రిస్థితులు, ఇది విడుద‌ల కాక‌పోతే వ‌చ్చే న‌ష్టాలు వంటి వాటిని వివ‌రిస్తూ.. ఓ వీడియో విడుద‌ల చేశాడు. ఇంకా ఈ విషయాలపై మాట్లాడిన కరణ్... దేశభక్తిని ప్రదర్శించడానికి ఉత్తమ మార్గం ప్రేమను పంచడమేనని తన సినిమాల ద్వారా అదే తాను చేస్తున్నానని అన్నాడు. "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా తీసేటప్పటికి ఇరు దేశాల సంబంధాలు బాగానే ఉండేవని భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ తో స్నేహ సంబంధాల కోసమే ప్రయత్నించిందని కరణ్ తన వీడియో సందేశంలో చెప్పాడు. అయితే ప్రస్తుతం సెంటిమెంట్లు వేరుగా ఉన్నాయని వాటిని తాను గౌరవిస్తానని అన్నాడు.

దీనిని చూసి పరిస్థితి చక్కబడుతుందనీ.., తన సినిమాని అందరూ ఆదరిస్తారనీ భావించాడు కరణ్ . కానీ, అనుకున్న‌ది ఒక్క‌టి అయింది ఒక్క‌టి అన్న‌ట్టుగా ఉంది క‌ర‌ణ్ ప‌రిస్థితి. తాజాగా 320 రూపాయల చెక్కును చీమా అనే వ్యాపారవేత్త కరణ్ జోహార్స్ ప్రొడక్షన్ హౌస్ కు పంపించాడు. చెక్కుతో పాటు ఓ లేఖ కూడా పంపిన సదరు వ్యాపారవేత్త, ఎందుకు ఈ చెక్కు పంపానో అంటూ సవివరంగా తెలిపారు.

Businessman sends cheque to Karan Johar, doesn't want to see him make losses

ఆ లెట‌ర్‌లో.. మిస్టర్ కరణ్ జోహార్..! మీరు విడుదల చేసిన వీడియోను చూసి చాలా బాధ పడ్డా. మీరు, మీ సినిమాలో పని చేసిన వారు నష్టపోకూడదనే ఉద్దేశంతో రూ. 320 చెక్ పంపిస్తున్నా (రెండు టికెట్ల ఖరీదు). ఒక బిజినెస్ మ్యాన్ గా మరో బిజినెస్ మ్యాన్ బాధ ఏమిటో నాకు తెలుసు. పాక్ నటులున్న‌ మీ సినిమాను నేను చూడదలుచుకోలేదు. కానీ, మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చెక్ పంపిస్తున్నా. పాక్ నటులను పెట్టుకుంటే పాకిస్థాన్ లో కూడా బిజినెస్ జరుగుతుంది. అందువల్ల లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది మీ ఉద్దేశం. కానీ, పాకిస్థాన్ వల్ల మన దేశంలోని వేలాది మంది నిత్యం క్షోభ అనుభవిస్తున్నారు! అని చీమా ఆ లెట‌ర్‌లో రాశాడు. దీంతో క‌ర‌ణ్ ఈ లెట‌ర్ చూసి షాక్ అయ్యాడ‌ట‌. మ‌రి ఎన్నో వివాదాల‌కు కేంద్రంగా మారిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

English summary
A businessman Karan Cheena has been creating a lot of waves on the social media circuit. Cheena has sent a written letter to Karan Johar along with a cheque of Rs. 320. in the letter, he has cited that he has no interest in watching Johar’s film whatsoever but as a fellow businessman, he is concerned about the director’s losses
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu