»   » ‘రంభతో లాలికాడు’....ఆనం వింత చేష్టలపై సినిమా

‘రంభతో లాలికాడు’....ఆనం వింత చేష్టలపై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి వింత చేష్టల గురించి....జనాలకు తెలిసిందే. చాలా సందర్భాల్లో ఆయన మీడియాలో తనదైన వింత వ్యవహార శైలితో వార్తల్లో వ్యక్తిగా మారాడు. త్వరలో ఆయనపై ఓ సినిమా రాబోతోంది. టైటిల్ ‘రంభతో లాలికాడు'. ఈ సినిమా తీయబోతోంది తెలుగు నిర్మాత సి.కళ్యాణ్.

ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే తెలుగు నిర్మాత సి.కళ్యాణ్....ఇపుడు ఆనం వివేకానంద రెడ్డిపై సినిమా తీస్తానని ప్రకటించి హాట్ టాపిక్ అయ్యాడు. శుక్రవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో సి. కళ్యాణ్ విలేకరులతో మాట్లాడుతూ ఆయన వికారపు చేష్టలను పరిగణలోకి తీసుకుని ఇలాంటి నాయకులు ఎలా ఉంటారో చెప్పడానికి ‘రంభతో లాలికాడు' సినిమా తీసే ఆలోచన ఉందని ఆయన అన్నారు.

C Kalyan controversial comments on Anam Viveka

తాను కొనుగోలు చేసిన స్థలంలో భాగం ఇవ్వలేదన్న కారణంతో ఆ స్థలం వక్ఫ్‌బోర్డుకు చెందినదంటూ.. వివేకా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని సికళ్యాణ్ ఆరోపించారు. నెల్లూరు రామ్‌నగర్‌లో 2008లో మక్సూద్‌ ఆలీ అనే వ్యక్తి వద్ద తాను రూ.1.60కోట్లకు స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. స్థలంలో వాటా ఇవ్వనందుకే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బెదరించారు.

వివేకానంద సెల్‌ఫోన్‌లో ఎప్పుడూ ఆయన డ్రీమ్‌ గర్ల్‌ ఫొటో ఉంటుందని, మొబైల్లో ఎటువంటి బొమ్మలు వస్తాయో అందరికి తెలుసని కళ్యాణ్‌ విమర్శించారు. ఆయన వ్యవహార శైలిపై రంభతో లాలికాడు సినిమా తీయబోతున్నట్లు తెలిపారు. వివేకా నాతో పెట్టుకుంటే మసైపోతావు. నువ్వు బయటకు రావాలంటే మంది కావాలి. నేను ఒక్కడినే వస్తా. ఏ సెంటర్‌కైనా వస్తా. నువ్వు ఎంత మందినైనా తెచ్చుకో బస్తీ మే సవాల్‌ కొట్టుకుందాం రా'' అంటూ.. సి.కళ్యాణ్‌ సవాల్‌ విసిరారు.

English summary
C Kalyan stated that he would make a movie on Anam's activities and he further went on warning Anam by telling that anyone who comes in his way will get a current shock.
Please Wait while comments are loading...