»   » ఈ రోజు రిలీజ్, ఫేస్ బుక్ లో పెట్టేసిన మొదటి పది నిమిషాలు వీడియో ఇదిగో!!

ఈ రోజు రిలీజ్, ఫేస్ బుక్ లో పెట్టేసిన మొదటి పది నిమిషాలు వీడియో ఇదిగో!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమ సినిమాలకు క్రేజ్ క్రియేట్ చేయటం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూంటారు దర్శక,నిర్మాతలు. అందులో భాగంగా ముందుగా తమ సినిమా ఇలా ఉండబోతోందనే రుచి చూపించి, మిగతా సినిమా కావాలంటే ధియోటర్ కు రండి అనే ఆలోచన ఒకటి. ఆ మధ్యన విజయ్ ఆంటోని తన చిత్రం భేతాళుడు కోసం ఇలాంటి టెక్నిక్ వాడారు. మొదటి పది నిముషాలు రిలీజ్ చేసి,ఓపినింగ్స్ రప్పించుకున్నాడు. ఇప్పుడు అలాగే మరో చిత్రం "కేరాఫ్ గోదావరి" కూడా అనుసరిస్తోంది.

C/O Godavari Movie first 10 minutes vedio released

"క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్" అనే వెరైటీ ట్యాగ్ లైన్ తో రూపొందిన చిత్రం "కేరాఫ్ గోదావరి". రోహిత్.ఎస్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఉషా మూవీస్ సమర్పణలో ఆర్.ఫిలిమ్స్ ఫ్యాక్టరీ ప్లస్ ప్రొడక్షన్స్-బొమ్మన ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తూము రామారావు(బాబాయ్)-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"రైటర్ మోహన్" గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన ప్రముఖ రచయిత రాజా రామ్మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రోహిత్ సరసన శ్రుతివర్మ, దీపు నాయుడు హీరోయిన్స్ గా నటించగా.. రఘు కుంచే సంగీతం సమకూర్చారు.
ఈనెల 24న విడుదలవుతున్న ఈ చిత్రంలోని ఒక రీల్ ను ఒక రోజు ముందు (ఫిబ్రవరి 23)న ప్రముఖ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి-ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి విడుదల చేశారు.


సినిమా విడుదలకు ఒక రోజు ముందు.. పది నిమిషాల నిడివి గల ఒక రీల్ ను ముందుగా రిలీజ్ చేయడడం బట్టి.. ఈ చిత్రం సాధించబోయే విజయం పట్ల దర్సక నిర్మాతలకు గల నమ్మకాన్ని తెలియజేస్తుందని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లాల్లోని హోల్ సేల్ స్వీట్ షాప్స్ కి వెళ్ళగానే.. శాంపిల్ మన చేతిలో పెట్టి.. టేస్ట్ చూసి, బాగుంటేనే కొనమని చెబుతుంటారని వారు అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, 'గోదావరి గురించి, దాని అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 44 జిల్లాలకు గోదావరితో అనుబంధం ఉంది. ఈ సినిమాను డిఫరెంట్‌ వేలో గోదావరోళ్ళ గురించి చెప్పే ప్రయత్నం చేశాం. వి.వి.సత్యనారాయణ సినిమాల తరహాలో ఉంటుంది. కచ్చితంగా ఇది అందరిని అలరించే చిత్రమవుతుంది' అని అన్నారు.

C/O Godavari Movie first 10 minutes vedio released

"పది నిమిషాల సినిమా విడుదల" కోసం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు రోహిత్, దర్శకుడు రాజా రామ్మోహన్ (రైటర్ మోహన్), నిర్మాతలు తూము రామారావు (బాబాయ్), బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల తదితరులు పాల్గొన్నారు.

"కేరాఫ్ గోదావరి" వంటి మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో రోహిత్ కృతజ్ఞతలు తెలపగా.. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తమ సినిమాలోని తొలి రీల్ ను రిలీజ్ చేయడం.. ఈ ప్రయత్నాన్ని అభినందించడం తమకెంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తోందని, ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని తప్పక ఆదరిస్తారనే నమ్మకం తమకు ఉందని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు!!

C/O Godavari Movie first 10 minutes vedio released

పోసాని, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, కోటేశ్వరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తాళ్ల వెంకట రెడ్డి, నిర్మాతలు: తూము రామారావు(బాబాయ్),-బొమ్మన సుబ్బారాయుడు-రాజేష్ రంబాల, కథ-మాటలు-ఒక పాట-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజా రామ్మోహన్ !!

English summary
Director SV KrishnaReddy and Producer Achhi Reddy released C/O Godavari Movie first 10 minutes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu