For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ '... రాంబాబు' కి గుమ్మడికాయ కొట్టేసారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌కల్యాణ్‌ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం కి గుమ్మిడికాయ కొట్టేసారు(సినిమా షూటింగ్ పూర్తైన అయిన రోజు గుమ్మిడికాయ కొట్టడం సంప్రదాయం). పూరీ జగన్నాధ్ చాలా రిలాక్స్ గా ఫీలయినట్లు యూనిట్ వర్గాలు చెప్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవన్ తో చేస్తూండటంతో ఆయనపై చాలా ఒత్తిడి ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంది.


  ఇక ఈ చిత్రం ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్,పవన్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా ఓ రేంజిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకూ ఏ హీరోకు లేనంతగా అమెరికా మినహా ఓవర్ సీస్ బిజెనెస్ కోటి రూపాయలు జరిగింది. ఈ చిత్రం విడుదల తేదీ అక్టోబర్ 18 న ఫిక్స్ చేసారు. ఇక మణిశర్మ అందించిన సంగీతం ..ఆడియో పంక్షన్ లేకుండా నేరుగా ఆడియో మార్కెట్ లోకి విడుదలవుతోంది.

  ఈ చిత్రంలో తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్‌ మోడల్‌ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్‌ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్‌ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'.

  ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం కథ మలుపుతిరుగుతుంది. అక్కడ నుంచి పవన్ మీడియా ద్వారా ఏమి చేస్తాడు..సమాజానికి ఏ విధంగా సాయం చేస్తాడు...స్కామ్ లు,దొంగ స్వాములు వంటివి ఎలా బయిటపెడుతూ ప్రజల మన్ననలు ఎలా పొందాడనేది మిగతా కథ అంటున్నారు. 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్

  English summary
  
 Pawan Kalyan’s ‘Cameraman Ganga tho Rambabu’ movie is now in post production phase and the film is gearing up for a release on October 18th. Puri Jagan is the director of the film and he has teamed up with Pawan Kalyan after more than a decade. Danayya DVV is the producer of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X