»   » ఆ హీరోని అన్నయ్యగా ఊహించుకోలేను: ఇలియానా

ఆ హీరోని అన్నయ్యగా ఊహించుకోలేను: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ కలల రాకుమారుడు రణబీర్ కపూర్ ని తాను అన్నయ్యగా ఊహించుకోలేనని ఇలియానా తెగేసి చెప్పింది. రీసెంట్ గా ఓ కొత్త ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ ని న్యూ డిల్లీలో లాంచ్ చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది ఇలియానా. మీడియాతో మాట్లాడుతూ తాను నిజ జీవితంలో ఏ హీరోనీ ముఖ్యంగా రణబీర్ కపూర్ ని అన్నయ్యగా ఊహించుకోలేను అని చెప్పింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఓ సాధారణ అమ్మాయిలాగా బేరమాడటమంటే తనకిష్టం అంటోంది నటి ఇలియానా. ఇలియానా దిల్లీలో జరిగిన రాయ్‌జెజ్‌.కామ్‌ కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా తన షాపింగ్‌ అలవాట్ల గురించి మీడియాతో మాట్లాడుతూ.. 'నేను అందర్లాంటి ఆడపిల్లనే, ఓ సాధారణ అమ్మాయిలాగే షాపింగ్‌ చేస్తాను, పెద్ద షాపింగ్‌ మాల్స్‌ నుంచి గల్లీ షాపుల వరకు అన్నింట్లో షాపింగ్‌ చేస్తాను. అందులోనూ బేరమాడి కొనుక్కోవడం అంటే నాకు మరీ మరీ ఇష్టం' అని చెప్పుకొచ్చింది ఇలియానా.

 Can't imagine Ranbir Kapoor as My Brother: Ileana

రీసెంట్ గా ఇలియానా సెక్స్ గురించి చేసిన కొన్ని హాట్ స్టేట్ మెంట్స్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాయట... సెక్స్ పట్ల అవగాహాన తెచ్చుకోవడం మంచిదని, ఇండియాలో సెక్స్ ని వేరే కోణం నుంచి చూసేవారు ఎక్కువని చెప్పుకొచ్చిందట ఇలియానా.

తెలుగులో లో నెంబర్ వన్ పొజీషన్ లో ఉండగానే, బాలీవుడ్ కి వలస వెళ్లింది ఈ స్లిమ్ బ్యూటీ. ఎన్నో ఆశలతో ముంభైలో అడుగుపెట్టిన ఇలియానాకు చివరకి నిరాశే ఎదురైంది. హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి హిందిలో సరైన అవకాశాలు రావడం లేదు.

అంతేకాదు బాలీవుడ్ చిత్రాల కోసం టాలీవుడ్ ని దూరంగా పెట్టడంతో ఇప్పుడు తెలుగులో కూడా ఇలియానాని పకలరించే నాధుడు లేకుండా పోయాడు. ఇటీవల టాలీవుడ్ లో అఖిల్ సినిమాలో ఐటమ్ ఆఫర్ తగలడంతో, ఎలాగైనా మళ్లీ బిజీగా మారాలని ఇలియానా తెగ తాపత్రయపడుతోంది.

English summary
To a query 'Which actor she can't imagine as her Brother?', Ileana names her Bollywood debut flick 'Barfi' co-star Ranbir Kapoor.
Please Wait while comments are loading...