»   » అమీర్ ఖాన్ పై కేసు

అమీర్ ఖాన్ పై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వివాదాస్పర వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనపై కాన్పూర్‌లో కేసు నమోదు అయింది. దేశంలో మత విద్వేషాలు రగిలిస్తున్నారని పేర్కొంటూ కొంతమంది ఆయనపై కార్పూర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అమీర్‌పై ఐపీసీ 295ఏ, 160ఏ సెక్షన్‌ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కూడా పోలీసులు అమీర్ ఖాన్ పై కేసులు నమోదయ్యాయి. డిసెంబర్‌ 1న కాన్పూర్‌ సెషన్స్‌ కోర్టు ముందు హాజరు కావాలని న్యాయస్థానం అమీర్‌ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది.

మరో ప్రక్క ఆమీర్‌ఖాన్‌కి తగినంత భద్రత ఏర్పాటు చేసినట్లు ముంబయిలోని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దేశంలో అసహనంపై ఆమీర్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Case filed against Aamir Khan in Kanpur court

డిల్లీలో మొన్న జరిగిన రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సెలెన్స్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమీర్‌ ఖాన్‌ దేశంలో అసహనంపై మాట్లాడారు. దేశంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాను కలత చెందినట్లు చెప్పారు. ఇవి తట్టుకోలేక తన భార్య కిరణ్‌రావు.. దేశం వదిలి వెళ్లిపోదామని కోరిందని ఆమీర్‌ చెప్పారు. దీనిపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో భద్రత ఏర్పాటు చేశారు.

దేశంలో అసహనంపై బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆమీర్‌ వ్యాఖ్యలపట్ల బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అనుపమ్‌ ట్విట్టర్‌ వేదికగా ఆమీర్‌పై పలు ప్రశ్నలు సంధించారు.

'ఏ దేశం వెళ్దామని మీరు... మీ భార్య కిరణ్‌రావుని అడిగారా. ఈ దేశం మిమ్మల్ని ఆమీర్‌ ఖాన్‌గా గుర్తింపు తెచ్చిపెట్టిందని అనుపమ్‌ఖేర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'భారత్‌ అసహన దేశంగా మీకు గత 8 నెలల నుంచి అనిపించిందా?. దేశంలో అసహనం ఉంటే భారతీయులకు ఏమని సలహా ఇస్తారు..? భారత్‌ వదిలివెళ్లిపోమని చెబుతారా' అని ప్రశ్నించారు.

English summary
Aamir Khan has been slapped with sedition charges in Kanpur sessions court for his 'intolerance' statement and the hearing is set to take place on December 1.
Please Wait while comments are loading...