»   » ఆగ్రహం ఉన్నా లోలోపలే.... పవన్ పై కేసు విషయం లో దూకుడు వద్దనుకున్న అభిమానులు

ఆగ్రహం ఉన్నా లోలోపలే.... పవన్ పై కేసు విషయం లో దూకుడు వద్దనుకున్న అభిమానులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

గడిచిన నాలుగు రోజులుగా వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్న జనసేన అధినేత కమ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తాజాగా ఒక కేసు నమోదైంది. వివిధ అంశాల మీద ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్న ఆయన.. శనివారం చేసిన ట్వీట్లపై ఒకరుఅభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనకు సంబంధించి కొన్ని ట్వీట్స్ చేయటం తెలిసిందే.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిపై పవన్ విమర్శిస్తూ కొన్ని ట్వీట్స్ చేశారు..ట్విట్ట‌ర్ ద్వారా రోజుకో అంశంపై స్పందిస్తూ బీజేపీపై విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపిస్తోన్న జ‌న‌సేనాని, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ నిన్న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూస్తూ గడపాల్సిన సాయంకాలాన్ని 'దేశభక్తి'ని నిరూపించుకునే పరీక్షకు వేదికగా మార్చడమేంటని, సినిమా థియేట‌ర్‌ల‌లోనే జాతీయగీతాన్ని పాడాల‌ని ఎందుకు చెబుతున్నార‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

Case FILED Against Pawan Kalyan

అయితే, ఇదే అంశంపై హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఈ రోజు ఆయ‌న‌పై కేసు నమోదైంది. దేశ అత్యున్న‌త న్యాయస్థాన‌మైన‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్‌ కల్యాణ్‌ అవమానించారంటూ హైకోర్టు న్యాయవాది జనార్దన్‌ గౌడ్ ఈ కేసును పెట్టారు. ప‌వ‌న్ ట్విట్టర్‌ లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అవమానించార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వీటిపై హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ తాజాగా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పవన్ తన ట్వీట్స్ తో అవమానించారంటూ ఆరోపించారు. జాతీయ గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈవిషయంలో సినీ ప్రముఖులు గానీ, ఇటు పొలిటికల్ పార్టీలనుంచి గానీ ఏ రకమైన స్పందనా రాకపోవటం విశేషం. అయితే ఇదే విషయం లో సుప్రీం కోర్ట్ అభిప్రాయానికి వ్యతిరేకంగా చాలామందే వ్యతిరేకంగా పోస్ట్లూ, ట్వీట్ లూ చేయగా కేవలం పవన్ మీద మాత్రమే కేసు నమోదు కావతం పై అభిమానులు కొంత ఆగ్రహంగానే ఉన్నా... ఇప్పుడున్న పరిస్థితులలో మరింత చెడ్డ పేరు వచ్చేలా ఉండే పనులను చేయవద్దని నిర్ణయించుకోవటం తో మిన్నకునండిపోయారు

English summary
Case Filed Against Pawan Kalyan For Opposing National Anthem In Theaters
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu