»   » మనోభావాలు దెబ్బతీసారు: 'గుంటూరు టాకీస్' సినిమాపై కేసు

మనోభావాలు దెబ్బతీసారు: 'గుంటూరు టాకీస్' సినిమాపై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్ రూపొందించిన గుంటూరు టాకీస్ చిత్రం వారం క్రితం విడుదలై ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంటూ భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వికలాంగుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారంటూ కేసు నమోదైంది.

గుంటూరు టాకీస్ ఫోటో గ్యాలెరీ


గుంటూరు టాకీస్ సినిమా దర్శక, నిర్మాతలపై తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సమితి నాయకులు దుండి సైదులు, బానాల వెంకటయ్య మాట్లాడుతూ సినిమాలో పలుమార్లు వికలాంగుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.


Case on Guntur Talkies movie

సినిమా దర్శక, నిర్మాతలపై పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సమితి నాయకులు మహేశ్, లక్ష్మణ్, అమృత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

English summary
A case has been registered against the director, producer, and actor of Praveen Sattar's Guntur Talkies movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu