»   » కాస్టింగ్ కౌచ్: రకుల్ ప్రీత్ మీద మాధవి లత సంచలనం... పిచ్చోళ్లను చేస్తోందంటూ!

కాస్టింగ్ కౌచ్: రకుల్ ప్రీత్ మీద మాధవి లత సంచలనం... పిచ్చోళ్లను చేస్తోందంటూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rakul Get Countered By Actress Madhavi Latha

తెలుగు సినిమా పరిశ్రమ తరుపున జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తాను ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా మీడియా వారు కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతుంటారని, తనకు అలాంటి పరిస్థితి ఎక్కడా ఎదురు కాలేదని, ఇండస్ట్రీలో అలాంటిది ఏమీ లేదని తాను ఎన్నో సార్లు చెప్పానని, తెలుగు ఇండస్ట్రీ అలాంటిదేమీ లేకుండా చాలా క్లీన్‌గా ఉందని రకుల్ తెలిపారు. అయితే రకుల్ వ్యాఖ్యలను నటి మాధవి లత తప్పుబట్టారు.

రకుల్ అబద్దాలు చెబుతోంది

రకుల్ అబద్దాలు చెబుతోంది

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది అస్సలు కరెర్ట్ కాదు అంటూ హీరోయిన్ మాధవి లత కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు, అలాంటి సందర్భాలు కూడా లేవు అని రకుల్ చెప్పడాన్ని తాను అంగీకరించబోనని మాధవి లత తెలిపారు.

రకుల్ నాన్ సెన్స్ టాకింగ్

రకుల్ నాన్ సెన్స్ టాకింగ్

ఒక ఆడదాన్ని తక్కువగా చూడటం, తప్పుగా మాట్లాడటం అనేది సమాజంలో ప్రతి చోట, ప్రతి రంగంలో ఉంది. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో లేదు, నేను వినలేదు, చూడలేదు, అలా ఉంటే నా పేరెంట్స్ ఎంతో బాధ పడి ఉండేవారు, కానీ ఇప్పటి వరకు అలా జరుగలేదు అని రకుల్ చెప్పడం.... పూర్తిగా నాన్‌సెన్స్ అని మాధవి లత అన్నారు.

టాలీవుడ్లో ఏ స్టార్ హీరోయిన్ సపోర్టు చేయదు

టాలీవుడ్లో ఏ స్టార్ హీరోయిన్ సపోర్టు చేయదు

ఎంతో ఫ్రీడమ్ ఉండే హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఉంది అని #మీటూ కాంపెయిన్ పెడితే ఎంతో మంది రియాక్ట్ అయ్యారు. ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సపోర్టు చేశారు. కానీ మన టాలీవుడ్లో ఒక్క స్టార్ హీరోయిన్ కూడా సపోర్టు చేయదు, మాట్లాడటానికి ముందుకు రారు. అందుకే ఇక్కడ #మీటూ కాంపెయిన్లు జరుగవు.... అని మాధవి లత అన్నారు.

అలా చెప్పి ఉండాల్సింది

అలా చెప్పి ఉండాల్సింది

ఈ రోజు రకుల్ ప్రీత్ గారు మాట్లాడింది పూర్తిగా తప్పు. ఇది అన్ని చోట్లా ఉంది, ఇక్కడ కూడా కొంచెం ఉంటుంది, దాన్ని మనం స్మార్ట్‌గా ఎలా తప్పించుకుని వెళ్లాలో, మంచి మార్గంలో ఎలా వెళ్లాలి అని అర్థమయ్యేట్లు చెబితే దటీజ్ కరెక్ట్. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లయింది, ఇప్పటి వరకు నాకు అలాంటి ఎదురు కాలేదు అని అనడం 100 శాతం తప్పు.... అని మాధవి లత అన్నారు.

ఇండస్ట్రీ బ్యాడ్ అని చెప్పడం లేదు

ఇండస్ట్రీ బ్యాడ్ అని చెప్పడం లేదు

నేను సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అని చెప్పడం లేదు. ఇలాంటిది అన్ని చోట్లా, అన్ని రంగాల్లో ఉంది. మనం ఎలా దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్లాము అనేదే ముఖ్యం. కానీ రకుల్ అలాంటి మనిషిని కానీ, నీడను కానీ చూడలేదని స్టేట్మెంట్ ఇవ్వడం పూర్తిగా తప్పు... అని మాధవి లత అన్నారు.

జనాలను పిచ్చోళ్లను చేయవద్దు

జనాలను పిచ్చోళ్లను చేయవద్దు

రకుల్ వాదన నిజమైతే.... హాలీవుడ్లో, బాలీవుడ్లో #మీటూ కాంపెయిన్లో పాల్గొన్నవారంతా అబద్దాలు చెబుతున్నట్లా? టాలీవుడ్లో జరుగడం లేదని చెప్పి జనాలను పిచ్చోళ్లను చేయవద్దు. ఇది చాలా తప్పు. అంత పెద్ద హీరోయిన్ అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదు... అని మాధవి లత అన్నారు.

English summary
Actress Madhavi Latha Sensational Comments On Rakul Preet Singh. Actress who had exposed casting couch in Telugu industry replying to Rakul Preet Singh's comments said as a star heroine she doesn't feel the pain, but that they are facing hardships in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X