»   »  స్కెచ్ బాగుంది: కుర్ర హీరో కోసం....కేథరిన్‌ చేత స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు

స్కెచ్ బాగుంది: కుర్ర హీరో కోసం....కేథరిన్‌ చేత స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను డైరక్షన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ కేథరిన్‌ కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది.

నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. " అన్నపూర్ణ స్టూడియోస్ లో కళా దర్శకుడు సాహి సురేష్ వేసిన ప్రత్యేకమైన సెట్ లో క్యాథరీన్-బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నాం. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సూపర్బ్ ఐటెమ్ నెంబర్ కు ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ ఐటెమ్ సాంగ్ ను ఒన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మార్చేందుకు మా డైరెక్టర్ బోయపాటి శీను స్పెషల్ కేర్ తీసుకొంటున్నారు" అన్నారు.

Catherine’s Special Song In Boyapati’s Next

రీసెంట్‌గా 'స‌రైనోడు' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయ‌పాటి చిత్రంలో స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌ర్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు. అలాగే ఈ చిత్రంలో త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో కీల‌క పాత్ర‌లోజ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరో‌గా, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, మాటలుః ఎం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను.

English summary
Boypati Srinu and young hero Bellamkonda Sai Srinivas new movie Dwaraka Creations Production No 2 from producer Miriyala Ravinder Reddy has got a special song attraction with gorgeous Catherine Tresa roped in.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu