»   » సిసిఎల్ 6: వెంకీకి సూపర్ స్టార్ పాదాభివందనం (ఫోటోస్)

సిసిఎల్ 6: వెంకీకి సూపర్ స్టార్ పాదాభివందనం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌-6లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం తెలుగు వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 209/2 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌ 204/5 పరుగులకే వెనుతిరిగారు.

ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌ రేట్‌తో తెలుగు వారియర్స్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగుల దూరంలో నిలిచింది తెలుగు జట్టు. తొలి బంతికి పరుగులేం రాలేదు. రెండో బంతికి నందకిషోర్‌ ఒక పరుగు తీశాడు. మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. చివర్లో 2 బంతులో 8 పరుగులు కావాల్సిన దశలో అశ్విన్‌ (30 బంతుల్లో 74) రనౌట్‌ అయ్యాడు. దాంతో వారియర్స్‌ పరుగుల వేట 5 పరుగుల దూరంలో ఆగిపోయింది.

మ్యాచ్ అనంతరం కన్నడ సూపర్ స్టార్ సుదీప్ వెంకీకి పాదాభివందనం చేయడం హాట్ టాపిక్ అయింది. తెలుగు వారియర్స్ కు హానరరీ కెప్టెన్ అయిన వెంకీ.. మ్యాచ్ పూర్తయిన అనంతరం మైదానంలోకి వస్తూ విజయం సాధించినందుకు సుదీప్ కు షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అతనేమో వంగి వెంకీ పాదాన్ని తాకి ఆశీర్వచనం తీసుకున్నాడు.

స్లైడ్ షోలో ఫోటోస్..

వెంకీ, సుదీప్

వెంకీ, సుదీప్


మ్యాచ్ అనంతరం కన్నడ సూపర్ స్టార్ సుదీప్ వెంకీకి పాదాభివందనం చేయడం హాట్ టాపిక్ అయింది.

విజయం

విజయం


మొదట బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 209/2 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలుగు వారియర్స్‌ 204/5 పరుగులకే వెనుతిరిగారు.

తెలుగు వారియర్స్

తెలుగు వారియర్స్


ఈ మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌ రేట్‌తో తెలుగు వారియర్స్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

అఖిల్

అఖిల్


ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అఖిల్ అక్కినేని.

ఉత్కంఠగా చివరి ఓవర్..

ఉత్కంఠగా చివరి ఓవర్..


చివరి ఓవర్లో తెలుగు జట్టు విజయానికి 11 పరుగులు అవసరం ఉండగా...కేవలం 5 పరుగులు మాత్రమే చేయడంతో ఓటమి తప్పలేదు.

ప్రణీత

ప్రణీత


ఉప్పల్ స్టేడియంలో హీరోయిన్ ప్రణీత సందడి.

అదా శర్మ

అదా శర్మ


ఉప్పల్ స్టేడియంలో హీరోయిన్ అదా శర్మ సందడి

English summary
CCL 6 Telugu Warriors vs Karnataka Bulldozers Match held at Hyderabad. Sudeep, Saikumar, Venkatesh, D Suresh Babu, Srikanth, Roshan, Adah Sharma, Taraka Ratna, Pranitha Subhash, Parvathy Nair, Aadi, Akhil Akkineni, Allu Sirish at the match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu