»   »  '1 నేనొక్కడినే' పై పూరీ, రామ్ గోపాల్ వర్మ కామెంట్

'1 నేనొక్కడినే' పై పూరీ, రామ్ గోపాల్ వర్మ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌ తాజా చిత్రం '1, నేనొక్కడినే' జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే సిని ప్రముఖులు మాత్రం ఈ చిత్రాన్ని ఓ రేంజిలో మెచ్చుకుంటున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ తో మహేష్ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

'1, నేనొక్కడినే' కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో దాదాపు 1450థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఈ సినిమాని దాదాపు 1200 థియేటర్లలో రిలీజ్‌ చేసారు. ఓవర్సీస్‌లో 250థియే టర్లలో రిలీజ్ అయిన చిత్రమిదే. ఏ ఇతర సినిమాతో పోల్చినా ఇదో రికార్డ్‌.

ఇంతవరకూ సుమారు వెయ్యి థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజయ్యేవి. వన్‌ ఆ రికార్డులను తుడిచేసింది. అలాగే ఓవర్ సీస్ లో సైతం రికార్డులు క్రియేట్ చేస్తోంది. అక్కడ ఒక మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు చెప్తున్నారు.

తెలుగు సినీ ప్రముఖులు ఏమన్నారు...స్లైడ్ షోలో...

రామ్ గోపాల్ వర్మ...

రామ్ గోపాల్ వర్మ...

ట్వీట్ చేస్తూ.. "ఇప్పుడే నేనొక్కడినే చూసాను...అది మాస్టర్ పీస్ కాదు...అది పీస్ మాస్టర్"

పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్


నేను నిన్న '1 నేనొక్కడినే' చూసాను...చాలా బాగా నచ్చింది. మహేష్ రాక్. వన్ మేన్ షో. పూర్తిగా కొత్త కథ. సుకుమార్ ఫ్యాషన్ తో ఈ సినిమా చేసారు. ("Yesterday I watched 1 NENOKKADINE, loved da movie. MAHESH rocked , one man show. Completely new story . SUKU made it with passion")

మంచు మనోజ్

మంచు మనోజ్


నేను ఇప్పుడే '1 నేనొక్కడినే' ఫినిష్ చేసాను. అద్బుతమైన మేకింగ్...తెలుగు సినిమాలు హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందించటం చాలా గర్వంగా ఉంది. ( "Just finished watching '1' #Nenokkadine . Top notch making and proud that even Telugu Movies can be made in Hollywood Standards.)

నిఖిల్

నిఖిల్


'1 నేనొక్కడినే' లో మహేష్ ఫెంటాస్టిక్ ఫెరఫార్మెన్స్ ...ఇంటర్వెల్ సీన్ కి థియోటర్ లో విజిల్స్..ఆనందంతో అరుపులు.. ఐ లవ్ ఇట్.

రాజమౌళి ట్వీట్ చేస్తూ...

రాజమౌళి ట్వీట్ చేస్తూ...

' రివ్యూలకు సంభంధం లేకుండా నేను సినిమాని బాగా ఎంజాయ్ చేసాను(ఛేజ్ సీన్స్ తప్ప). సుకుమార్ మరోసారి నాకు ఫేవెరెట్ అయ్యారు. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్,రత్నవేల్ విజువల్స్ ఎక్సటార్డినరీగా ఉన్నాయి.నాజర్ ,కెల్లీ చనిపోయే సీన్స్, మహేష్ తల్లితండ్రులను వెతికే సన్నివేశాలు నా బెస్ట్ మూమెంట్స్. అలాగే ఇప్పటివరకూ మహేష్ చేసిన వాటిల్లో పోకిరీలో నాజర్ మరణం తర్వాత చేసేదే బెస్ట్ ఫెరఫార్మెన్స్. అయితే వన్ క్లైమాక్స్ ఇంకా బెటర్ గా ఉంది" అన్నారు.

నితిన్

నితిన్


'1 నేనొక్కడినే' సినిమా చూసాను..నాకు బాగా నచ్చింది. మహేష్ బాబు రాకెడ్...( " Watched one film n even i liked it a lot..mahesh babu rocked!!")

అన్ని భాషల్లో...

అన్ని భాషల్లో...

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజవుతుండడం ఇంకో రికార్డ్‌. ముఖ్యంగా కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, జపాన్‌, రష్యా తదితర చోట్ల అక్కడి స్థానిక భాషల్లో రిలీజవుతుండడం పెద్ద సెన్సేషన్‌. ఆయా ప్రాంతీయ భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో సినిమా వేయనున్నామని నిర్మాతలు తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని లండన్‌, ఉత్తర అమెరికా పరిసరాలు సహా జపాన్‌లోనూ చిత్రీకరించారు.

ట్రేడ్ లో...

ట్రేడ్ లో...


ఇక ఈ సినిమా కథ,కథనాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని టాక్ వ్యాపించంటతో వాటి ప్రభావం కలెక్షన్స్ పై పడింది. రిలీజ్ రోజు ఓ రేంజిలో ఓపినింగ్స్ రాబట్టుకున్నా రెండో రోజు నుంచే బాగా డ్రాప్ అవటం మొదలెట్టాయి..అయితే సంక్రాంతి పండుగ రోజునుంచి చిత్రం కలెక్షన్స్ బాగున్నాయని ట్రేడ్ టాక్.

ప్రమోషన్ ...

ప్రమోషన్ ...


ఎప్పుడూ మీడియా ముందుకు రాని మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే రాజమౌళి సైతం సినిమాని ట్విట్టర్ తో,ఇంటర్వూలతో ప్రమోట్ చేస్తున్నారు. ఏ ఛానెల్ లో చూసినా సుకుమార్ ఇంటర్వూలు వస్తున్నాయి.

ఓవర్ సీస్ లో ...

ఓవర్ సీస్ లో ...


వాతావరణ పరిస్ధితులు అనుకూలించకపోయినా, రివ్యూలు బాగోలేకపోయినా...ఓవర్ సీస్ బిజినెస్ బాగుందని నిర్మాతలు చెప్తున్నారు. అక్కడ $1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఓవర్ సీస్ లో మహేష్ బాబు ని కొట్టేవాడు లేడు...రాడు అంటున్నారు.

English summary

 Mahesh Babu's latest, '1 Nenokkadine' maybe getting some negative responses from fans, but Tollywood seems to be rallying behind the movie in a big way. Directors, actors, and others from the industry have taken to Twitter to praise the psychological thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu