For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014లో మరణించిన సీనీ సెలబ్రిటీలు (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: కాలం వేగంగా పరుగులు పెడుతోంది. ఈ ప్రయాణంలో కొన్ని సంతోషకరమైన సంఘటనలు, మరికొన్ని విషాద ఘటనలు. ప్రతి సంవత్సరం ఎంతో మంది తనలో కలుపుకుపోతున్న కాల చక్రం...ఈ సంవత్సరం కూడా పలువురు సినీ ప్రముఖులను తనలో విలీనం చేసుకుంది.

  తెలుగు సినీ పరిశ్రమంలో నాలుగు రోజుల క్రితమే నిర్మాత నందమూరి జానకిరామ్ మరణంతో విషాద ఛాయలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవడు, హాలీవుడ్ లలో 2014 సంవత్సరం పలువురు సెలబ్రిటీలు కాలం చేసారు. మరికొన్ని రోజుల్లో 2014 సంవత్సరం ఎండ్ అవుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో కాలం చేసిన వారి గురించి తెలుసుకుందాం.

  స్లైడ్ షోలో సెల్రబిటీల వివరాలు, ఫోటోలు....

  నందమూరి జానకి రామ్

  నందమూరి జానకి రామ్

  నందమూరి బిడ్డ, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై పలు సినిమాలు నిర్మిస్తున్న నందమూరి జానకి రామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.

  దేవన్ వర్మ

  దేవన్ వర్మ

  ఖట్టా మీఠా, అంగూర్ చిత్రాల్లో హాస్యపాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు దేవన్ వర్మ(78) రెండు రోజుల క్రితం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలపాటు హిందీ చిత్రసీమలో అనేక హాస్య పాత్రలు పోషించిన దేవన్ వర్మ తన నటనతో ఎందరో అభిమానుల్ని గెలుచుకున్నారు. బీఆర్ చోప్రా 1961లో నిర్మించిన ధర్మపుత్రతో కెరీర్‌ను మొదలుపెట్టిన వర్మ వందకు పైగా చిత్రాల్లో నటించారు.

  సుచిత్ర సేన్

  సుచిత్ర సేన్

  ప్రముఖ బెంగాలి నటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుచిత్రాసేన్ (82) (మూన్ మూన్ సేన్ తల్లి) ఈ సంవత్సరం జనవరి 17న కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆసుపత్రిలో మరణించారు. (పాత)దేవదాసు సినిమాలో ఆమె నటనకు ఉత్తమనటి అవార్డు అందుకొన్నారు. బెంగాలీ సినిమాలలో ఆమెకు ఒక ప్రత్యెక స్థానం, గౌరవం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను అత్యంత ప్రతిష్టాత్మకమయిన ‘వంగ విభేషణ్' బిరుదుతో సత్కరించింది.

  జోహ్రా సెహగల్

  జోహ్రా సెహగల్

  బాలీవుడ్ ప్రముఖ నటి జోహ్రా సెహగల్ ఈ సంవత్సరం జులైలో కన్నుమూసారు. 102 యేళ్ల సెహగల్‌ 1912లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్ పూర్‌లో జన్మించారు. ఆమె 1946లో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ప్రముఖ నటిగా పేరొందారు. 1998లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ, 2010లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో సత్కరించారు.

  రవి చోప్రా

  రవి చోప్రా

  కొంత కాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ దర్శకుడు రవి చోప్రా (68) గత నెల మృతిచెందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్‌లో చేరిన ఆయన మధ్యాహ్నం మూడు గంటలకు తుది శ్వాస విడిచారు.

  ఈర్ల్ హాయెస్, స్టెఫానీ మోస్లీ

  ఈర్ల్ హాయెస్, స్టెఫానీ మోస్లీ

  హాలీవుడ్ సెలబ్రిటీ కపులు ఈర్ల్ హాయెస్, స్టెఫానీ మెస్లీ డిసెంబర్ 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరిని హత్య అని కొందరు, ఆత్మహత్య అనికొందరు అంటున్నారు. ఏ విషయం అనేది తేలాల్సి ఉంది.

  కెన్ వెదర్ వాక్స్

  కెన్ వెదర్ వాక్స్

  ‘ది ఆడమ్స్ ఫ్యామిలీ' స్టార్ కెన్ వెదర్ వాక్స్...కాలిఫోర్నియాలో హార్ట్ ఎటాక్ తో మరణించారు.

  రాబిన్ విలియమ్స్

  రాబిన్ విలియమ్స్

  ఆస్కార్ విన్నింగ్ యాక్టర్, హాలీవుడ్ కమెడియన్ రాబిన్ విలియమ్స్ ఆగస్టు నెలలో ఆత్మహత్య చేసుకున్నారు.

  జోన్ రివెర్

  జోన్ రివెర్

  హాలీవుడ్ బెస్ట్ కెమెడియన్లలో ఒకరైన జోన్ రివర్ గుండె సంబంధ వ్యాధితో సెప్టెంబర్లో కన్నుమూసారు.

  మైక్ నికోలస్

  మైక్ నికోలస్

  హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మైక్ నికోలస్....గత నెలలో కన్నుమూసారు.

  రిచర్డ్ హటెన్ బర్గ్

  రిచర్డ్ హటెన్ బర్గ్

  ప్రముఖ ఇంగ్లిష్ ఫిల్మ్ డైరెక్టర్ రిచర్డ్ హటెన్ బర్గ్ ఆగస్టులో కన్నుమూసారు.

  ఫిలిప్ సీమర్ హాఫ్‌మేన్

  ఫిలిప్ సీమర్ హాఫ్‌మేన్

  ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఫిలిప్ సీమర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మరణించారు. హెరాయిన్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల అతను మరణించినట్లు గుర్తించారు.

  English summary
  The recent tragic deaths of rapper Earl Hayes and his wife, Stephanie Moseley has left everyone shocked. The celebrity couple tragically died on Dec. 8. Police suspect they were both involved in an act of murder-suicide where Earl first shot his wife, Stephanie and then killed himself in their LA apartment. It is also said that Earl killed her as he felt Stephanie was cheating on him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X