»   » బాలయ్య కూతురుకు సినీప్రముఖుల ఆశీర్వాదం(ఫోటోలు)

బాలయ్య కూతురుకు సినీప్రముఖుల ఆశీర్వాదం(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని వివాహం GITAM సంస్థ ఫౌండర్ ఎంవివిఎస్ మూర్తి మనవడు శ్రీభరత్‌తో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్‌లో జరిగిన వివాహ వేడుకకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయళం మరియు హిందీ చిత్రసీమల నుంచి సినీ ప్రముఖులు హాజరు కావడంతో వివాహ వేడక సినీ స్టార్స్‌తో కళకళలాడింది. ఈ రోజు ఉదయం 8.52 గంటలకు శుభముహూర్తాన తేజస్విని-శ్రీభరత్ హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక్కటయ్యారు. కూతురు పెళ్లి కోసం బాలయ్య ఏర్పాట్లు భారీగా చేసారు. ప్రముఖ సినీ కళా దర్శకుడు ఆనందసాయి ఆధ్వర్యంలో పెళ్లివేదికను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాట్లు చేసారు. పెళ్లి మండపం ఏర్పాటు కోసం 350 మంది పని చేసారు.

అలంకరణ కోసం బ్యాంకాక్ నుంచి ప్రత్యేకంగా పూలను తెప్పించారు. ఈ వేడుకలో తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు బాలయ్య. అభిమానులు, ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో బాలయ్య కూతురు తేజస్విని వివాహం గ్రాండ్‌గా జరిగింది.

తెలుగు సినీ పరిశ్రమ నుంచి హాజరైన ప్రముఖుల్లో సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఫ్యామిలీ, వెంకటేష్, రామోజీరావు, కృష్ణం రాజు, జగపతి బాబు, శ్రీకాంత్, గోపీచంద్, జయసుధ, రోజా, ఉదయకిరణ్, అలీ, సునీల్, వివి వినాయక్, వందే మాతరమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, తరుణ్, శివాజీరాజా తదితరులు హాజరయ్యారు.

తేజస్విని-శ్రీభరత్‌లను ఆశీర్వదిస్తున్న చిరంజీవి

తేజస్విని-శ్రీభరత్‌లను ఆశీర్వదిస్తున్న చిరంజీవి

కేంద్ర మంత్రి, మెగా స్టార్ చిరంజీవి తన తోటి నటుడు, రాజకీయ నాయకుడైన బాలయ్య కూతురు తేజస్విని వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య ఆ మధ్య మాటల యుద్ధం జరిగినా...ఇక్కడ మాత్రంకలివిడిగా గడిపారు.

మోహన్ బాబు

మోహన్ బాబు

బాలయ్యతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిన వారిలో నటుడు, నిర్మాత మోహన్ బాబు ఒకరు. ఆయన ఈ వివాహ వేడుకకు కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి హాజరయ్యారు.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బాలయ్యకు స్వయాన బావ, వీయంకుడైన చంద్రబాబు తేజస్విని-శ్రీభరత్‌ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పెళ్లి వేడుకలో వెంకటేష్

పెళ్లి వేడుకలో వెంకటేష్

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేష్ తన తోటి అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూతురు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గోపీచంద్

గోపీచంద్

టాలీవుడ్ హీరో గోపీచంద్ బాలయ్య కూతురు వివాహానికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోపీచంద్ వివాహం కూడా ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ మేనకోడలిని గోపీచంద్ పెళ్లాడారు.

శ్రీకాంత్

శ్రీకాంత్

నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని-శ్రీభరత్ వివాహ వేడుకకు టాలీవుడ్ కథానాయకుల్లో ఒకరైన శ్రీకాంత్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

జయసుధ

జయసుధ

ప్రముఖ నటి, ఎమ్మెల్యే జయసుధ తన భర్తతో కలిసి బాలయ్య కూతురు వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

మనోజ్

మనోజ్

మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ బాలయ్య కూతురు తేజస్విని వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. బాలయ్య, మనోజ్ కలిసి ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రంలో కలిసి నటించారు.

రోజా

రోజా

బాలయ్యతో కలిసి పెద్దయ్య, భైరవద్వీపం, మాతో పెట్టుకోకు, సుల్తాన్, గాండీవం చిత్రాల్లో నటించిన నటి రోజా తేజస్విని-శ్రీభరత్ వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

దర్శకుడు బి గోపాల్

దర్శకుడు బి గోపాల్

ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ బాలయ్య కూతురు వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలో నటించారు.

English summary
Nandamuri Balakrishna's second daughter Tejaswini has tied the knot with GITAM founder MVVS Murthy's grandson Sribharat at a star-studded wedding ceremony held at Hitex in Madhapur, Hyderabad this morning (August 21). Hundreds of celebrities from Telugu Tamil, Kannada, Malayalam and Hindi film industries swarmed into this grand wedding hall and blessed the newly married couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu