»   » బాలయ్య సంతాపం: ఎన్టీఆర్,పూరి నివాళి, సెలబ్రిటీల క్యూ (ఫోటోస్)

బాలయ్య సంతాపం: ఎన్టీఆర్,పూరి నివాళి, సెలబ్రిటీల క్యూ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రము నిర్మాత రామానాయుడు మరణ వార్త విన్నవెంటనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఉలిక్క పడింది. ఆయన చివరి చూపు కోసం పలువురు సెలబ్రిటీలు రామానాయుడు నివాసానికి క్యూ కట్టారు. అందుబాటులోని పలువురు స్టార్స్ తమ సంతాపాన్ని వ్యక్తి చేసారు. తెలుగు స్టార్స్ జూ ఎన్టీఆర్, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, అల్లు అరవింద్, బ్రహ్మానందం, బిగోపాల్, ఎన్ శంకర్, క్రిష్, పూరి జగన్నాథ్, చార్మి, రాఘవేంద్రరావు, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రవితేజ, సాయి కుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్, ఆర్ నారాయణమూర్తి, ప్రసాద్ వి పొట్లూరి, అనుష్క, కృష్ణ రాజు, మురళీ మోమన్, శ్రీదేవి, ఎస్వీ కృష్ణా రెడ్డి తదితరులు రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించారు.

పలువురు స్టార్స్ ప్రెస్ నోట్ల ద్వారా సంతాపం ప్రకటించారు.

బాలయ్య....
తెలుగు చిత్రసీమ గొప్పనిర్మాతను కోల్పోయింది. తొలి సినిమాని నాన్నగారితో రాముడు-భీముడు నిర్మించిన ఆయన తర్వాత శ్రీకృష్ణ తులాభారం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. అలాగే నేను కూడా ఆయన నిర్మాతగా చేసిన కథానాయకుడు, రాము చిత్రాల్లో నటించాను. ఎన్నో గొప్ప విలువలున్న నిర్మాత. అనేక మంది కొత్త దర్శకులను నటీనటులను, టెక్నీషియన్స్ ను పరిచయం చేయడమే కాకుండా భారతీయ భాషలన్నింటిలో చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి. ఈ రోజు ఆయన మనల్ని విడిచిపోవడం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మోహన్ బాబు...
శతాధిక చిత్రాల నిర్మాతగా ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన గ్రేట్ ఫిలింమేకర్. పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నారు. నిరాడంబరత, క్రమశిక్షణ, మొక్కవోని ధైర్యం ఆయన సొంతం. నిర్మాతకి సరికొత్త అర్థం చెప్పిన ఆయన సక్సెస్ ఫుల్ నిర్మాత అయ్యారు. ఆయన లేని లోటు తీరనిది. ఆ సాయి బాబా, ఏడుకొండలవాడు ఆయన ఆత్మకి శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.

బోయపాటి శ్రీను...
ఎంతో మంది కళాకారులకు తోడ్పాడు అందించిన గొప్ప వ్యక్తి. నిర్మాత అంటే ఎలా ఉండాలో తెలియజేసిన వ్యక్తి. ఎంతో మంది కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసారు. సినీ పరిశ్రమలో అందరికీ ఆప్తుడాయన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

అల్లరి నరేష్
ఈ రోజు మేం ఇండస్ట్రీలో నిలబడి ఉండటానికి కారణమైన వ్యక్తి రామానాయుడు గారు. నాన్నగారికి ప్రేమఖైదీ చిత్రంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నాన్నగారితో పాటు ఎంతో మంది కొత్త దర్శకులకు ఆయన అవకాశం ఇచ్చారు. అన్నయ్యతో హాయ్, నిరీక్షణ వంటి చిత్రాలు నిర్మించారు. మా కుటుంబానికి ఆయనతో చాలా క్లోజ్డ్ అటాచ్మెంట్ ఉంది. నాన్నగారు ఎప్పుడూ ఆయన గురించి, ఆయన గొప్పదనం గురించి చెబుతుండేవారు. నిర్మాతగా పరిశ్రమలో గొప్పతనాన్ని తెలియజేసిన వ్యక్తి. అలాంటి నిర్మాతను మళ్లీ చూడలేమేమోననిపిస్తుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

శర్వానంద్..
ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు ఉండవచ్చు. కానీ రామానాయుడు గారి లాంటి నిర్మాతలు చాలా అరుదు. నిర్మాతకి సినిమా పట్ల ఎంత ప్రేమ, కమిట్మెంట్, ఎలాంటి కమాండ్, నటీనటులకు తగ్గట్లుగా ఎంత బడ్జెట్ లో సినిమా తియ్యాలో ఇలా 24 క్రాప్ట్స్ పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి రామానాయుడుగారు. ఆయన లేని లోటు తీరనిది. రామానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

ప్రసాద్ వి పొట్లూరి
తన హార్డ్ వర్క్‌తో పరిశ్రమలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. నిర్మాత అంటే ఇలాగే ఉండాలనడానికి ఆయనే రోల్ మోడల్. ఎన్నో వందల కుటుంబాలకు ఆయన ఉపాధి కల్పించారు. తెలుగు సినిమాకి పెద్ద దిక్కు. తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఆయన మనల్ని విడిచి వెళ్లి పోవడం బాధాకరం. ఎన్నో విలువలున్న ఆదర్శవంతమైన వ్యక్తిని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను...

అల్లాణి శ్రీ‌ధ‌ర్ సంతాపం
శ‌తాధిక చిత్రాల నిర్మాత‌గా పేరు గాంచిన ప్ర‌ముఖ నిర్మాత డాక్ట‌ర్ రామానాయుడు ఆక‌స్మిక మృతి ప‌ట్ల తెలంగాణా ద‌ర్శ‌కుల సంఘం త‌రుపున తెలంగాణా ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత అల్లాణి శ్రీ‌ధ‌ర్ , కార్య‌ద‌ర్శి కాస‌ర్ల ముర‌ళి లు సంతాపం తెలియ జేశారు. తెలంగాణాకు సంబందించిన ఎంద‌రో సాంకేతిక నిపుణుల‌ను .. న‌టీన‌టుల‌ను ...ద‌ర్శ‌కుల‌ను తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం చేసి ఎన‌లేని సేవ‌లు అందించిన డాక్ట‌ర్ రామానాయుడు గారి స్పూర్తి రెండు తెలుగు రాష్ట్రాల చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు దిక్సూచి కావాల‌ని ఆకాంక్షిస్తూ వారి దివ్య స్మృతికి నివాళులు అర్పిస్తున్నాము.

స్లైడ్ షోలో ఫోటోలు...

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ దర్శకుడు డి.రామానాయుడు.

ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.

రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్.

రామానాయుడు

రామానాయుడు

రామానాయుడి భౌతిక కాయం.

రవితేజ

రవితేజ

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు రవితేజ.

సాయి కుమార్

సాయి కుమార్

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ నటుడు సాయి కుమార్.

బివిఎస్ఎన్ ప్రసాద్

బివిఎస్ఎన్ ప్రసాద్

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్.

ఆర్.నారాయణమూర్తి

ఆర్.నారాయణమూర్తి

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ప్రముఖ నటుడు ఆర్.రానాయణమూర్తి.

అల్లు అరవింద్

అల్లు అరవింద్

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.

బ్రహ్మానందం

బ్రహ్మానందం

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం.

బిగోపాల్

బిగోపాల్

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ దర్శకుడు బిగోపాల్.

ఎన్.శంకర్

ఎన్.శంకర్

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ఎన్ శంకర్.

క్రిష్

క్రిష్

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న దర్శకుడు క్రిష్.

పూరి జగన్నాథ్, చార్మి

పూరి జగన్నాథ్, చార్మి

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రముఖ దర్శకుడు పూరి, నటి చార్మి.

పివిపి

పివిపి


రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న నిర్మాత పివిపి.

అనుష్క

అనుష్క

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న నటి అనుష్క.

కృష్ణం రాజు దంపతులు

కృష్ణం రాజు దంపతులు

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న కృష్ణం రాజు దంపతులు.

మురళీ మోహన్

మురళీ మోహన్

డాక్టర్ డి రామానాయుడు భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న మరళీ మోహన్ తదితరులు.

వెంకటేష్, అభిరాం

వెంకటేష్, అభిరాం

రామానాయుడు భౌతిక కాయం వద్ద మనవుడు అభిరాం, తనయుడు వెంకటేష్.

శ్రీదేవి

శ్రీదేవి

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న నటి శ్రీదేవి

ఎస్వీ కృష్ణారెడ్డి

ఎస్వీ కృష్ణారెడ్డి

రామానాయుడు భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వస్తున్న ఎస్వీ కృష్ణారెడ్డి.

English summary
Celebs Pay Pays Condolences To D. Ramanaidu.
Please Wait while comments are loading...