»   » అంతా బూతే: జబర్దస్త్, పటాస్ ప్రోగ్రాంపై సెన్సార్ బోర్డ్ సభ్యుడి ఫిర్యాదు

అంతా బూతే: జబర్దస్త్, పటాస్ ప్రోగ్రాంపై సెన్సార్ బోర్డ్ సభ్యుడి ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న..... పటాస్, జబర్దస్త్ కార్యక్రమాల్లో అసభ్య పదజాలం, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువయ్యాయని, కామెడీ పండించే క్రమంలో బూతు కంటెంటును జొప్పిస్తున్నారనే విమర్శలు ముందు నుండి ఉన్నాయి.

తాజాగా ఈ కార్యక్రమాలపై సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. హైద‌రాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేస్తూ ఈ కార్యక్రమాల్లో వాడుతున్న పదజాలం అభ్యంతరకరంగా ఉందని, ఆ రెండు ప్రోగ్రాంలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయ‌, ఇలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అశ్లీలం, అనైతికం

అశ్లీలం, అనైతికం

పటాస్, జబర్దస్త్ కార్యక్రమాల్లో కొన్ని ఎపిసోడ్‌ల‌లో అశ్లీలం, అనైతిక దృశ్యాలు ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలోకి చెడు మెసేజ్ వెలుతుందని ఫిర్యాదు చేసారు.

రోజా, నాగబాబు లాంటి వారు ప్రోత్సహించడం బాధాకరం

రోజా, నాగబాబు లాంటి వారు ప్రోత్సహించడం బాధాకరం

నటి రోజా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంలో మహిళలను, చిన్న పిల్లలను కించపరిచే కార్యక్రమాలను ప్రోత్సహించడం, నాగబాబు లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలకు జరుగడం బాధాకరమని అన్నారు.

సమాజంపై దుష్ప్రభావం

సమాజంపై దుష్ప్రభావం

ఈ రెండు కార్యక్రమాల్లో కామెడీ పేరుతో ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం.... లాంటి చర్యలు సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని నందనం దివాకర్ అభిప్రాయ పడ్డారు.

‘బూతు బూతే.... ఆలోచించండి రామోజీరావుగారు', దర్శకుడి షాకింగ్ కామెంట్!

‘బూతు బూతే.... ఆలోచించండి రామోజీరావుగారు', దర్శకుడి షాకింగ్ కామెంట్!

ఈ మధ్య కాలంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు చూడలేక పోతున్నాం... బూతు కంటెంటు ఎక్కువ అవుతోంది, రామోజీ రావు లాంటి గొప్పవారు నిర్వహిస్తున్న ఛానల్స్ లో ఇలాంటివి చూడటం బాధగా ఉందని కామెంట్ చేసారు తమ్మారెడ్డి భరద్వాజ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Censor board member Nandanam Diwakar filed a police Case Against Telugu TV comedy shows Patass and Jabardasth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu