»   » పవన్ కళ్యాణ్ వార్నింగుతో...డొంక కదులుతోంది!

పవన్ కళ్యాణ్ వార్నింగుతో...డొంక కదులుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు ముందే బయటకు లీకైన విషయమై....ఇటీవల జరిగిన థాంక్యూ మీట్లో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. సినిమా లీక్ వెనక కొందరు పరిశ్రమ పెద్దల కుట్ర ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనికి వెనక పరిశ్రమలోని ప్రముఖులు ఉన్నారని ఆయన చెప్పడం, వారిని వదిలి పెట్టను అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

కాగా....పవన్ కళ్యాణ్ వార్నింగుతో ఇండస్ట్రీలోని వివాదాల డొంక కదులుతున్నట్లు స్పష్టం అవుతోంది. పరిశ్రమలో రెండు మూడు గ్రూఫులు ఉన్నాయని, ఒకరంటే ఒకరికి అస్సలు పడటం లేదని....ఎప్పటి నుండో తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దల గురించి మాట్లాడింది అక్షరసత్యమని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా తన మనసులోని మాట బయట పెట్టాడని.....పవన్ కళ్యాణ్‌కు సపోర్టివ్‌గా మాట్లాడారు చదలవాడ. మరి ఆ పెద్దలు ఎవరు? అనేది మాత్రం చదలవాడ బయటకు వెల్లడించలేదు.

'అత్తారింటికి దారేది' చిత్రం లీక్ వెనక ఉన్న పెద్దల భాగోతాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన సినిమా ఆడకున్నా ఫర్వాలేదు...పక్కోడు సినిమా సర్వనాశనం అయిపోవాలి అనే స్వార్థం, అసూయతో ఇలాంటి చర్యలకు పాల్పడి వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట.

English summary
Producer Chadalavada Srinivasa Rao supports Pawan Kalyan's speech at AD function. In the event, Pawan Kalyan said ‘ it was painful to see some coward trying to paint the film black with the leak… On this stage, I am warning them".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu