twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ నామినేషన్ రేసులో మద్దాలి ‘చదువుకోవాలి’

    By Bojja Kumar
    |

    Chaduvukovali
    హైదరాబాద్ : విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ నిరక్షరాస్యుల్లో చైతన్యం కలిగించేలా తెరకెక్కిన చిత్రం 'చదువుకోవాలి'. పవన్‌సాయి క్రియేషన్స్ పతాకంపై సీనియర్ పాత్రికేయుడు, రచయిత మద్దాళి వెంకటేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

    తాజాగా ఈచిత్రం ఆస్కార్ నామినేషన్ పోటీల్లో నిలబడింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని వివిధ భాషలకు చెందిన చిత్రాలను పరిశీలించి దేశం తరుపున ఒక సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు నామినేట్ చేస్తారు. ఆ లిస్టులో ముద్దాలి సినిమా 'చదువుకోవాలి' కూడా ఉంది. సెప్టెంబర్ 17 నుంచి ఆస్కార్ నామినేషన్ చిత్రాల పరిశీలన జరుగనుంది.

    ఇప్పటికే 'చదువుకోవాలి' చిత్రం భరతముని అకాడమీ నుంచి 9 అవార్డులు చేసొంతం చేసుకుంది. అదే విధంగా టీవీ9-టీఎస్ఆర్ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికయింది. ఈచిత్ర దర్శకుడు మద్దాలి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కరాన్ని కూడా అందున్నారు.

    ఈ సినిమా వల్ల తాను ఆర్థికంగా ఇబ్బందులపాలైనా...సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాన్ని అందించామన్న తృప్తి మిగిలిందని, దేశంలో వందశాతం అక్షరస్యత కోసం ఈ సినిమా తోడ్పడుతుందని ముద్దాలి తెలిపారు. చెన్నై, కేరళ, ముంబై, జైపూర్, కలకత్తా, గోవా, కెనడా, పాట్నా, హైదరాబాద్ తదితర ప్రపంచ సినిమా ఉత్సవాలకు తమ సినిమా పంపిస్తున్నామని ఆయన చెప్పారు.

    English summary
    Maddali Venkateswara Rao's Chaduvukovali movie has been nominated to Oscar nominations list. The film has nominated in 'Best Foreign Language Film Award category' Film Federation of India, Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X