»   »  నావి నాకు ఇప్పించండి: వదినపై చక్రి సోదరుడి ఫిర్యాదు

నావి నాకు ఇప్పించండి: వదినపై చక్రి సోదరుడి ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం తర్వాత ఆయన కుటుంబంలో ఆస్తి గొడవలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో చక్రి భార్య శ్రావణి..... చక్రి తల్లి, సోదరుడు మహిత్ నారాయణ మధ్య వివాదం సాగుతోంది. చక్రి మరణానికి మీరంటే మీరే కారణంటూ అటు చక్రి భార్య, ఇటు చక్రి సోదరుడు, తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వివాదం ఇలా ఉంటే ఇటీవల చక్రి కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం పెద్ద సంచలనమే రేపింది.

తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ..... తన వదిన శ్రావణిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన సోదరుడు చక్రికి సంబంధించిన స్టూడియో వదిన శ్రావణి ఆదీనంలో ఉందని, దాన్ని తెరిపించాలని కోరారు. తాను పలు చిత్రాలకు పని చేస్తున్నానని, నా ట్యూన్స్ కొన్ని స్టూడియోలోనే ఉండిపోయాయి, అవి ఇపుడు ఎంతో అవసరం...వెంటనే స్టూడియో తెరిపించాలని ఫిర్యాదు చేసారు.

Chakri's Brother Mahith Narayana Complaint

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చక్రి మరణంపై వీడిన మిస్టరీ... 

చక్రి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. చక్రి అంత్య క్రియలు ముగిసిన వెంటనే కుటుంబంలోని విబేధాలు బయట పడ్డాయి. చక్రి సంపాదించిన ఆస్తి గురించి...అతని భార్య ఓ వైపు, తల్లి-తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు మరో వైపు గొడవ పడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చక్రిని మీరే చంపారంటే మీరూ చంపారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఆయన మరణం వెనక రహస్యాన్ని తేల్చడానికి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆయనది విష ప్రయోగం కాదు, సహజ మరణమే అని తేల్చారు.

చక్రి మరణంపై మిస్టరీ వీడినా....ఆయన కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా చక్రి సంపాదించని ఇల్లు. ఇతర ఆస్తులు విషయంలో ప్రధానంగా ఈ గొడవ జరుగుతోంది. తన భర్త డెట్ సర్టిపికెట్ తనకు ఇవ్వడం లేదని చక్రి భార్య శ్రావణి ఆరోపించిన సంగతి తెలిసిందే.

తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు. కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు. చక్రి ఉన్నప్పుడు అంతా బాగా ఉండే వారని, ఇపుడు మాత్రం వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు.

అయితే చక్రి తల్లి, తమ్ముడి వాదన మరోలా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ..‘‘నాకు అంగవైకల్యం ఉంది. ‘కుంటోడా' అని ఎప్పుడూ నన్ను వదిన హేళన చేసేది. అన్నయ్య ముఖం చూసి ఊరకుండేవాడిని. అమ్మని, మమ్మల్ని చూసే ఆమెకు పడేది కాదు. వాళ్లయినా సుఖంగా ఉండాలని మేం ఇంటి నుంచి వచ్చేశాం. అన్నయ్య మరణంపై మాకు తొలిరోజే అనుమానం ఉంది. కానీ చక్రి పరువు తీయొద్దని పెద్దలు సర్దిచెప్పడంతో ఊరకున్నాం. కానీ ఆమె మాపై నిందలు వేశాక ఇప్పటికి కూడా బయటకు రాకపోతే తప్పవుతుందని వచ్చి పోలీసులకు అన్నీ ఫిర్యాదు చేశాం. '' అని అన్నారు.

English summary
Chakri's Brother Mahith Narayana complaint againist Chakri's wife Sravani.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu