twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్రి మరణం: ఇక తేలాల్సింది ఆస్తుల గొడవ!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చక్రి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. చక్రి అంత్య క్రియలు ముగిసిన వెంటనే కుటుంబంలోని విబేధాలు బయట పడ్డాయి. చక్రి సంపాదించిన ఆస్తి గురించి...అతని భార్య ఓ వైపు, తల్లి-తమ్ముడు, ఇతర కుటుంబ సభ్యులు మరో వైపు గొడవ పడటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చక్రిని మీరే చంపారంటే మీరూ చంపారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లింది. ఆయన మరణం వెనక రహస్యాన్ని తేల్చడానికి ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆయనది విష ప్రయోగం కాదు, సహజ మరణమే అని తేల్చారు.

    Chakri

    చక్రి మరణంపై మిస్టరీ వీడినా....ఆయన కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా చక్రి సంపాదించని ఇల్లు. ఇతర ఆస్తులు విషయంలో ప్రధానంగా ఈ గొడవ జరుగుతోంది. తన భర్త డెట్ సర్టిపికెట్ తనకు ఇవ్వడం లేదని చక్రి భార్య శ్రావణి ఆరోపించిన సంగతి తెలిసిందే.

    తన భర్త చనిపోగానే ఆయన కుటుంబ సభ్యులు తనను వేధించటం మొదలు పెట్టారని శ్రావణి చెప్పారు. కుటుంబ వ్యవహారం కావటంతో తాము దాసరి నారాయణరావు గారిని కలవటం జరిగిందని, ఆయన ఏం చెబితే అలా చేసేందుకు తాను సిద్దంగా ఉన్నా... చక్రి కుటుంబ సభ్యులు మాత్రం సహకరించలేదన్నారు. ఆ తర్వాతే పోలీసుల్ని ఆశ్రయించటం జరిగిందన్నారు. చక్రి ఉన్నప్పుడు అంతా బాగా ఉండే వారని, ఇపుడు మాత్రం వారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదన్నారు.

    అయితే చక్రి తల్లి, తమ్ముడి వాదన మరోలా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ గతంలో మాట్లాడుతూ..‘‘నాకు అంగవైకల్యం ఉంది. ‘కుంటోడా' అని ఎప్పుడూ నన్ను వదిన హేళన చేసేది. అన్నయ్య ముఖం చూసి ఊరకుండేవాడిని. అమ్మని, మమ్మల్ని చూసే ఆమెకు పడేది కాదు. వాళ్లయినా సుఖంగా ఉండాలని మేం ఇంటి నుంచి వచ్చేశాం. అన్నయ్య మరణంపై మాకు తొలిరోజే అనుమానం ఉంది. కానీ చక్రి పరువు తీయొద్దని పెద్దలు సర్దిచెప్పడంతో ఊరకున్నాం. కానీ ఆమె మాపై నిందలు వేశాక ఇప్పటికి కూడా బయటకు రాకపోతే తప్పవుతుందని వచ్చి పోలీసులకు అన్నీ ఫిర్యాదు చేశాం. '' అని అన్నారు.

    English summary
    Forensic team which observed the bones of Chakri made it clear that Chakri's death was "natural" and he wasn't killed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X