చక్రి చివరి కోరిక: జగనన్నను చూడాలని...

By Bojja Kumar

హైదరాబాద్: తెలుగు సంగీత దర్శకుడు చక్రి మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. అందరికీ ఆత్మీయుడుగా పేరొందిన ఆయన మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. చిత్ర పరిశ్రమలో చక్రితో బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి దర్శకుడు పూరి జగన్నాథ్. తొలి నాళ్లలో ఇద్దరూ కలిసి పలు హిట్ చిత్రాలకు పని చేసారు.

నిన్న అర్ధరాత్రి వరకు రికార్డింగ్ స్టూడియోలోనే గడిపిన చక్రి....ఇంటికి బయల్దేరుతూ ఎందుకో జగనన్న ( పూరిజగన్నాథ్‌ )ను చూడాలని ఉందిరా అంటూ తన ఆఫీసు బాయ్‌తో అన్నారు.

Chakri's Last Words About Puri Jagannath

పూరి జగన్నాథ్ - చక్రి ఒకేసారి కెరీర్ మొదలు పెట్టారు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్ర బాచి. ఆ తర్వాత వచ్చిన ఇట్టు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, 143, నేనింతే, గోలిమార్‌, ఆంధ్రావాలా లాంటి చిత్రాలకు పని చేసారు.

ఇద్దరు ఒకరంటే ఒకరు ఎంతో అభిమానంగా ఉండేవారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా మెలిగేవారని వారి సన్నిహితులు అంటూ ఉంటారు. చక్రి మృతిపట్ల పూరి స్పందిస్తూ ‘ నా సోదరుడు (చక్రి)ని నేను చాలా మిస్‌ అవుతున్నానంటూ ట్వీట్‌ చేస్తూ చక్రికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు'.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X