»   » పవన్-నితిన్ మూవీ జోరు..... ‘రంగస్థలం’పై ప్రభావం పడనుందా?

పవన్-నితిన్ మూవీ జోరు..... ‘రంగస్థలం’పై ప్రభావం పడనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ డూపర్ కలెక్షన్లతో దూసుకెళుతున్న 'రంగస్థలం' మూవీ రేపటి నుండి కాస్త స్లో అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మించిన 'ఛల్ మోహన్ రంగ' సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదలవుతుండటమే.

Chal Mohan Ranga Movie Promotions By Nithin,Megha Akash

మార్చి 30న విడుదలైన 'రంగస్థలం' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో భారీ వసూళ్లు సాధించి ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో 80 శాతం రికవరీ అయింది. సెకండ్ వీక్‌లో ఈ చిత్రం మంచి లాభాలు నమోదు చేయనుంది. అయితే 'ఛల్ మోహన్ రంగ' విడుదలతో కలెక్షన్లపై కాస్త ప్రభావం పడే అవకాశం ఉంది. నితిన్ మూవీకి నాలుగు బలమైన ప్లస్ పాయింట్స్ ఉండటమే ఇందుకు కారణం.

పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్

పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్

పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో హీరో నితిన్ ఒకరు. పైగా ‘ఛల్ మోహన్ రంగ' చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తన సొంత బేనర్లో నిర్మించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రిప్టు అందించడం మరో ప్లస్ పాయింట్. ఈ కారణాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

 స్క్రీన్స్ సంఖ్య తగ్గే అవకాశం

స్క్రీన్స్ సంఖ్య తగ్గే అవకాశం

‘ఛల్ మోహన్ రంగ' సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో', ‘సత్య గ్యాంగ్', ‘గులే బకావలి' చిత్రాలు విడులవుతున్నాయి. ఈ నాలుగు సినిమాల కలిసి తెలుగు సినిమాల మార్కెట్ పరిధిలో ఉన్న 1500 స్క్రీన్లను ఆక్రమించనున్నాయి. దీంతో ప్రస్తుతం అత్యధిక థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ‘రంగస్థలం' చిత్రం స్క్రీన్ కౌంట్ తగ్గడం ఖాయం.

 త్రివిక్రమ్ పెన్ పవర్

త్రివిక్రమ్ పెన్ పవర్

దర్శకుడు త్రివిక్రమ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఫ్యామిలీ డ్రామాలు ఆయన డీల్ చేసినట్లు ఎవరూ చేయలేరు. అలాంటి త్రివిక్రమ్ ‘ఛల్ మోహన్ రంగ' చిత్రానికి స్క్రిప్టు అందించారు. ఈ కంటెంటు ప్రేక్షులకు కనెక్ట్ అయితే ప్రేక్షకుల ప్రవాహాన్ని ఆపడం ఎవరివల్లా కాదు.

ఎంటర్టెన్మెంటు కంటెంటు ఎక్కువే

ఎంటర్టెన్మెంటు కంటెంటు ఎక్కువే

‘ఛల్ మోహన్ రంగ' చిత్రాన్ని కావాల్సినంత వినోదం జోడించి తెరకెక్కించారు. ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేయదగ్గ క్లీన్ ఎంటర్టెనర్ అని చిత్ర యూనిట్ అంటోంది. ఈ ఎంటర్టెన్మెంట్ కంటెంట్ ప్రేక్షకులకు ఎక్కితే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం ఖాయం.

English summary
Ram Charan's Rangasthalam is facing a threat from actor Nithiin's Chal Mohana Ranga (CMR), which will hit the screens April 5 and may affect the former's collections at the worldwide box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X