జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'చమ్మక్ చల్లో'. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తుండగా, సంచిత పదుకోనే, కేథరిన్ హీరోయిన్‌లుగా పరిచయమవుతున్నారు. డి.ఎస్. రావు సమర్పణలో శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ "ఇది బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కథ, కథనాలు కొత్తగా ఉండటమే కాక, యువతరం, పెద్దల మనోభావాలకు అద్దంపట్టే విధంగా ఉంటాయి. పాత్రల మధ్య జరిగే సంఘటనలు, సన్నివేశాలు, సంఘర్షణలు ప్రేక్షకుణ్ణి ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతాయి. కథానుగుణంగానే ఈ టైటిల్ పెట్టాము, కిరణ్ వారణాసి సంగీతం సమకూర్చిన పాటలు ఆకట్టుకుంటాయి'' అని చెప్పారు.
వరుణ్ సందేష్ మాట్లాడూ...నీలకంఠగారి దర్శకత్వంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది, నీలకంఠగారు మొదటి సారి చేసిన కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ ఇది. హ్యాపీడేస్ తరువాత అలాంటి బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం ఇది, హ్యాపీడేస్ ను మించి హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.
నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకొచ్చాయనీ, త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామనీ, నవంబర్ మూడవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామన్నారు. సమర్పకులు డి.ఎస్. రావు తెలిపారు. అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, చిన్మయి, సురేఖావాణి తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: రంగనాథ్ గోగినేని, కూర్పు: నాగిరెడ్డి, కళ: బాబ్జీ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ.
Varun Sandesh's 'Chammak Challo' trailer launched today at Prasad Labs. Chammak Challo directed by Neelakantha, promises to be a love story with a difference. The film has been mostly done. The makers are planning to release the film November soon.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more