»   » ‘చందమామ కథలు’ విడుదల వాయిదా?

‘చందమామ కథలు’ విడుదల వాయిదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమణి, కృష్ణుడు, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచా పనయ్, చైతన్య కృష్ణ, పృథ్వి, వెన్నెల కిషోర్, కొండవలస, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'చందమా కథలు'. ఈ చిత్రం ఈ వారమే విడుదల అవ్వాల్సి ఉండగా....అనుకోని కారణాలతో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మార్చి 21న లేదా 28న విడుదల చేసే అవకాశం ఉంది.

'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

దర్శకుడు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ... ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో చోట్ల తనకి తారసపడే వ్యక్తుల ద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా సమాజంలో మంచి చెడుల్ని చూస్తుంటాడు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకొని మరి కొన్నింటిని నేర్చుకుంటుంటాడు. అలాగే కొన్ని అనుభవాలను కూడా సంపాదిస్తుంటాడు. అటువంటి కొన్ని పాత్రల అనుభవాలు, పర్యావసనాలు, ఫలితాల సమాహారమే 'చందమామ కథలు'. సినిమా కథాంశం అన్నారు.

కథ విషయానికొస్తే....అది 1972, ఇంకా ఆధునికతకు అంతగా అలవాటు పడనికాలం... 18ఏళ్ల సరిత, 20 ఏళ్ల మోహన్ ప్రేమించుకున్నారు, పెళ్ళిచేసుకోవా లనుకున్నారు. సరిత ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. అర్థం చేసుకునే అమ్మా నాన్న ఉన్నా మోహన్ తన వైపు నుంచి ఏం చేయలేయక పోయాడు సరిత చివరి ప్రయత్నంగా ఎదిరించింది వాళ్ళు చచ్చిపోతామని బెదిరించారు. దీంతో తల్లితండ్రులు చూపించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఇక ఈ దేశంలోనే ఉండడానికి మనసు ఒప్పక మోహన్ అమెరికాకి వెళ్ళిపోయాడు... కాలం వేగం అందుకుంది...40 ఏళ్లు ఎలా గడిచాయో తెలియనంత వేగం...2012, మోహన్ తిరిగి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్.

English summary
Lakshmi Manchu, Naresh, Krishnudu, Chaitanya Krishna starrer ‘Chandamama Kathalu’ was supposed to release this Friday across the state but its release has now been postponed. As per the latest update, the movie will release on March 21st or 28th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu