»   » ప్రియమణి ‘చండీ’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్(ఫోటోలు)

ప్రియమణి ‘చండీ’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రియమణి ప్రధాన పాత్రలో వి.సముద్ర దర్శకత్వంలో శ్రీను బాబు నిర్మిస్తున్న రూపొందుతున్న చిత్రం 'చండీ'. ఈచిత్రం ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. త్వరలో ఈచిత్రం ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పోషించబోయే పాత్ర పేరు అశోక్ గజపతి రాజు.

ఈ పాత్ర గురించి చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ...చండీలో ప్రియమణి తండ్రిగా, ఊరి పెద్దగా, స్వాతంత్ర్య సమరయోధిడిగా కృష్ణం రాజు పవర్ ఫుల్ రోల్ చేసారు' అని తెలిపారు. గతంలో కృష్ణరాజు చేసిన బొబ్బిలి బ్రహ్మన్న, పల్నాటి పౌరుషం, తాండ్ర పాపారాయుడు రేంజిలో అశోక్ గజపతి రాజు పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.

ఇటీవల ఆడియో విడుదల మంచి రెస్సాన్స్ సొంతం చేసుకుందని దర్శక నిర్మాతలు తెలిపారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నట్లు తెలిపారు.

చండీ

చండీ


చండీ సినిమాకు వి.సముద్ర దర్శకుడు. జి.జగన్నాథనాయుడు సమర్పణలో ఒమిక్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై డాజి.శ్రీనుబాబు నిర్మిస్తున్నారు. ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది ఈచిత్ర కథాంశం 3 విభిన్న కోణాలు, గెటప్‌లు నా ప్రియమణి పాత్రలో కనిపిస్తాయి.

యాక్షన్ మూవీ

యాక్షన్ మూవీ


ప్రియమణి ప్రధాన పాత్రలో ‘చండీ' మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో...ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.

ప్రియమణి డేరింగ్

ప్రియమణి డేరింగ్


ఈ సినిమాలో ప్రియమణి ధైర్య వంతురాలుగా, డేరింగ్ లేడీగా కనిపించనుంది. ఇందులో ఆమె గుర్రపు స్వారీ, ఆర్చరీ లాంటి విద్యలను పదర్శించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా విభాగాల్లో శిక్షణ కూడా తీసుకుంటోంది.

నటీనటులు, సాంకేతిక విభాగం

నటీనటులు, సాంకేతిక విభాగం


ఆశిష్ విద్యార్థి, సుప్రీత్, రంగనాథ్, నాగేంద్రబాబు, వినోద్‌కుమార్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్, అలీ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వాసు, సంగీతం: ఎస్‌.ఆర్‌.శంకర్‌, చిన్నా, ఎడిటింగ్‌: నందమూరి హరి, కళ: వెంకటేశ్వర్లు మల్లెల, కథ-మాటలు: కరణం పి.బాబ్జీ, సహనిర్మాత: సత్య ముమ్మిడి, కథనం-దర్శకత్వం: వి.సముద్ర.

English summary
Priyamani starrer Chandi movie platinum disc function held in Hyderabad. Krishnam Raju play 'Asoka Gajapati Raju' role in this movie. The movie directed by V Samudra and G.Srinu Babu is producer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu