»   » నిలకడగా....చంద్రమోహన్ ఆరోగ్యం

నిలకడగా....చంద్రమోహన్ ఆరోగ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ నటుడు చంద్రమోహన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య బృందం తెలిపింది. చంద్రమోహన్‌కు బుధవారం గుండెపోటుతో రావడంతో ఆయన మేనల్లుడు కృష్ణమోహన్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించారు. హృదోగ నిపుణుడు డాక్టర్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. చంద్రమోహన్‌ స్పృహలోనే ఉన్నారని, కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న తర్వాత డిశ్చార్జ్‌ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మేనల్లుడు కృష్ణ ప్రసాద్ స్పందిస్తూ....ప్రస్తుతం చంద్రమోహన్ ఆరోగ్యంగా ఉన్నారని, చెస్ట్ లో పెయిన్ వచ్చిందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు.

Chandra Mohan health condition stable

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు.

క్రొత్త హీరోయిన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను అప్పట్లో పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. "ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు" అని సినీఅభిమానులు భావిస్తారు.

English summary
Apolo doctors said that, Actor Chandra Mohan health condition is stable.
Please Wait while comments are loading...