twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామా నాయుడు జయంతి.. సినీరంగంలో సంపాదించిన డబ్బును.. మాజీ సీఎం కామెంట్స్

    |

    మూవీ మొగల్ డా.డి రామానాయుడు జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ‌తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా మనిషి రామానాయుడు. టాలీవుడ్ స్థాయిని పెంచేలా నిరంతరం కృషి చేసిన రామానాయుడుని అత్యున్నత పురస్కారం వరించింది. నేడు ఆయన జయంతి సందర్భంగా చిత్ర పరిశ్రమతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం స్మరించుకుంటున్నారు.

    ఫిల్మ్ ఛాంబర్‌లో వేడుకలు..

    ఫిల్మ్ ఛాంబర్‌లో వేడుకలు..

    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు 85వ జయంతి వేడుకలు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు , సి.కల్యాణ్ , కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

    స్పందించిన దగ్గుబాటి ఫ్యామిలీ..

    స్పందించిన దగ్గుబాటి ఫ్యామిలీ..

    రామానాయుడు జయంతి సందర్భంగా వెంకటేష్, సురేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. నిరంతరం గుర్తొస్తూనే ఉంటారు నాన్న మిమ్మల్ని మిస్ అవుతున్నామని వెంకటేష్ ట్వీట్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖులు రామానాయుడు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.

    మాజీ సీఎం స్పందన..

    మాజీ సీఎం స్పందన..

    రామానాయుడు జయంతి సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘భారతదేశంలోని 13 భాషలలో అతి తక్కువ కాలంలో శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన నిర్మాత స్వర్గీయ డా.రామానాయుడుగారు. మాజీ పార్లమెంటు సభ్యులుగా బాపట్ల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం

    Recommended Video

    'HIT' Movie Actor Maganti Srinath Exclusive Interview
    సినీరంగంలో సంపాదించిన డబ్బును..

    సినీరంగంలో సంపాదించిన డబ్బును..


    తాను సినీరంగంలో సంపాదించిన డబ్బును తిరిగి ఆ రంగ అభివృద్ధికే ఖర్చుచేసి ఎంతో మందికి ఉపాధినిచ్చారు రామానాయుడుగారు. ఈరోజు పద్మ భూషణ్ రామానాయుడుగారి జయంతి సందర్భంగా సినీరాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    English summary
    Chandrababu Naidu Pays Tribute To Ramanaidu 85th Birth Anniversary. On Occassion of Ramanaidu Birth Anniversary Cine And Political celebraties Pays tribute.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X