»   » చంద్రబాబు ఇంట బాలకృష్ణ ‘సింహా’ ఆనందోత్సవం!

చంద్రబాబు ఇంట బాలకృష్ణ ‘సింహా’ ఆనందోత్సవం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద గ్యాప్ తరువాత బాలకృష్ణ తాజాగా నటించిన 'సింహా" చిత్రం ఏప్రిల్ 30న విడుదలయ్యి అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నది. అటు సింహా అభిమానుల అంచనాలను రెట్టింపు చేస్తు ఉండటంతో నందమూరి అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా విడుదల తొలి ఆటనుండే అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ రెస్సాన్స్ రావటం అటు బాలయ్య అభిమానుల్లోను ఇటు తెలుగుదేశం పార్టీలో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఈ ఆనందోత్సహాన్ని బాలయ్య కూడా తన వియ్యంకుడు, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పంచుకున్నారు. చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి, దర్శకుడు బోయపాటి శ్రీనులతో కలిసి శుక్రవారం రాత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లిన బాలయ్యతో అక్కడ ఆమె సోదరి భువనేశ్వరి చేత కేక్ కట్ చేయించారు.

ఈ సందర్బంగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా" అధ్యక్షలు మురళీ మోహన్ గారు బాలకృష్ణని కలిసి 'మా" తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సినిమాలు మరెన్నో బాలకృష్ణ గారు చేయాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి కూడా ఇలాంటి పెద్ద పెద్ద హిట్ప్ కావాలని ఆయన మనసారా ఆకాంక్షించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu