»   » బాస్ ఈజ్ బ్యాక్: చిరంజీవి 150, 151, 152 గురించి చెర్రీ!

బాస్ ఈజ్ బ్యాక్: చిరంజీవి 150, 151, 152 గురించి చెర్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా మెగా అభిమానులను ఎప్పటి నుండో ఊరిస్తోంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారే కానీ సినిమా మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. ఆ మధ్య పూరితో సినిమా ఓకే అయినట్లే అయి చివరి నిమిషంలో రద్దయింది. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ చేస్తారని, తమిళంలో హిట్టయిన కత్తి సినిమానే తెలుగులో చిరంజీవి తన 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారని అంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ విషయమై మాట్లాడుతూ... క‌త్తి సినిమా నాన్న గారికి న‌చ్చింది. 150వ సినిమాగా క‌త్తి రీమేక్ చేస్తారా? లేక‌ వేరే క‌థతో చేస్తారా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ద‌స‌రా లోపు నాన్న‌గారు 150వ సినిమా గురించి పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఉండాల‌ని 150వ సినిమా విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త తీసుకుంటున్నాం. అంతకు మించి మరే కారణం లేదు అన్నారు.

 Charan about Chiranjeevi 151 and 152 Movie Projects

ఇంకా 150వ సినిమా మొదలు కాలేదు..... తర్వాత చేసే సినిమాలకు కథలు కూడా రెడీగా ఉన్నాయని అంటున్నాడు చెర్రీ. నాన్న‌గారు న‌టించే 151, 152 సినిమాల‌కు క‌థ‌లు సిద్దంగానే ఉన్నాయి. డైరెక్ట‌ర్స్ శ్రీను వైట్ల‌, వి.వి.వినాయ‌క్ రెడీగా ఉన్నార‌ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

చిరంజీవిని మళ్లీ తెరపై చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ‘బ్రూస్ లీ' సినిమా కొద్ది పాటి ఆనందం కలిగిస్తుందని ఆశిస్తున్నారు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ఈ సినిమాలో చిరంజీవి ఓ చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నసంగతి తెలిసిందే.

English summary
Charan surprised everyone as he said that things are already set for Chiru’s 151st and 152nd films. Charan revealed that Chiru has already okayed the directors and producers for his next two films which will be made right after the 150th film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu