రామ్ చరణ్, అఖిల్ రూ. 1.4 కోట్లు డొనేట్ చేసారా?

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఇలాంటి వేడుకలో రామ్ చరణ్ డాన్స్ చేయడం ఇదే తొలిసారి. మరో వైపు కుర్ర హీరో అఖిల్ కూడా ఇదే వేడుకలో తన డాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము రేపాడు. ఈ ఇద్దరూ పోటా పోటీగా పెర్పార్మెన్స్ ఇవ్వడంతో పాటు ఆడియన్స్ తో సూపర్బ్ అనిపించుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇచ్చిందుకు గాను రామ్ చరణ్ రూ. 1 కోటి, అఖిల్ కు రూ. 40 లక్షలు పేమెంట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం చెన్నైరిలీఫ్ ఫండ్ కు ఇచ్చేలా నిర్వాహకులతో ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Charan and Akhil 1.4 cr donation

ఈ ఒప్పందం ప్రకారమే రామ్ చరణ్, అఖిల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకోసం రెండు మూడు రోజుల ముందు నుండే ప్రాక్టీస్ చేసారు. కారణం ఏమైనా ఒక మంచి పని కోసం ఈ ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ పాటు పడటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సౌత్ సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అవార్డుల వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ హాజరై సందడి చేసారు.

Charan and Akhil 1.4 cr donation

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరిగాయి. మొదటి రోజు తమిళ, మలయాళ సినిమాల అవార్డు ప్రదానోత్సవం జరగగా, నిన్న సాయంత్రం తెలుగు, కన్నడ భాషలకు సంబందించిన అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకకి సౌత్ చిత్ర సీమలోని స్టార్ హీరోస్ అందరూ హాజరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X