»   » ‘ఆరంజ్’తో మగధీరుడు సాధించే మరో సంచలన విజయం...

‘ఆరంజ్’తో మగధీరుడు సాధించే మరో సంచలన విజయం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసిన చిత్రం 'పులి". పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం ఎంతో పవర్ ని చూపుతుందని అభిమానులు ఊహించారు. కానీ వారి ఊహలు తారుమారు అయ్యాయి. దాంతో వారు బాగా నిరుత్సాహంగా ఉన్నారని సమాచారం. మళ్ళీ వాళ్ళల్లో జోష్ రావాలంటే అబ్బాయి రామ్ చరణ్ 'ఆరంజ్" రూపంలో ఓ హిట్ ఇవ్వాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.

వీలైనంత త్వరగా మెగాభిమానుల్లో మళ్ళీ ఉత్సాహం నింపేందుకై నవంబర్ 11నే 'ఆరంజ్" తో రాబోతున్నాడు రామ్ చరణ్. అయితే ఇప్పటికే 'ఆరంజ్" లో రామ్ చరణ్ లుక్ అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు లక్కీ హీరోయిన్ జెనీలియా కాంబినేషన్ - బొమ్మరిల్లు" భాస్కర్ డైరెక్షన్ ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

అలాగే ఎన్నో మ్యూజిక్ హిట్స్ ఇచ్చిన హారిస్ జైరాజ్ 'ఆరంజ్"ని మెగా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిపే రేంజ్ లో అద్భుతమైన ఆడియో సిద్దం చేశారని తెలుస్తోంది. సో..మెగా హీరోల అభిమానులిక నవంబర్ 11 కోసం, 'ఆరంజ్"తో మగధీరుడు సాధించే మరో సంచలన విజయం కోసం వేచి చూడొచ్చు. బాబాయ్ అభిమానులను నిరుత్సాహపరిచాడు. మరి అబ్బాయ్ ఆనందపరుస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu