Just In
- 30 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 49 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
- 1 hr ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 3 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Finance
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Automobiles
ఈ ఏడాది భారత్లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు
- Lifestyle
ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు ఉపయోగించే కొన్ని విచిత్రమైన నివారణలు!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్ లవర్ బాయ్ లుక్స్ తో టీజర్స్ లో ఇరగదీసుండు...!?
మాస్ ఇమేజ్ ఉన్న జూ ఎన్టీఆర్ రూటు మార్చి 'బృందావనం" లాంటి ప్యామిలీ ఎంటైనర్ లో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసి, పాసయ్యాడు. ఈ యంగ్ టైగర్ పాస్ అయినట్లుగానే రామ్ చరణ్ పాస్ అవుతాడా? అని పరిశీలకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, 'చిరుత, మగధీర" లాంటి మాస్ చిత్రాల్లో నటించిన తర్వాత రామ్ చరణ్ రూట్ మార్చి 'ఆరెంజ్" లో అవర్ బోయ్ లా నటిస్తున్నాడు. జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకుని చేసినట్టుగానే రామ్ చరణ్ కూడా ఫ్యామిలీని టార్గెట్ గా చేసుకుని 'ఆరెంజ్" చేస్తున్నాడు. మరి..జూ ఎన్టీఆర్ లా పాస్ అవుతాడో లేదో చూడాల్సిందే.
నిన్న మాటీవీ" లో ప్రసారమైన మగధీర చిత్రానికి మద్య మద్య ఇస్తోన్న బ్రేక్స్ లో చరణ్ లవర్ బాయ్ లుక్స్ తో 'ఆరెంజ్" టీజర్స్ ని వేశారు. కొత్త లుక్ తో చరణ్ బాలీవుడ్ యంగ్ హీరోలకు ధీటుగా సరికొత్త స్టైలింగ్ తో 'ఆరెంజ్" టీజర్స్ లో కన్సిస్తోన్న చరణ్, యువతకు రోల్ మోడల్ గా నిలుస్తాడంటూ అభిమానులు అప్పుడే తమ అభిమాన హీరో గెటప్ చూసి మురిసిపోతున్నారు. జెనీలియా, షాజన్ పదామ్సీ హీరోయిన్లుగా నటిస్తోన్న 'ఆరెంజ్" చిత్రానికి 'బొమ్మరిల్లు", 'పరుగు" చిత్రాల ఫేం భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
తెరకెక్కించిన రెండు చిత్రాలతోనూ ఫీల్ గుడ్ మూవీస్ స్పెషలిస్ట్ అన్పించుకున్న భాస్కర్, చరణ్ ని లవర్ బాయ్ లా సూపర్బ్ గా చూపించాడనేది ఇన్ సైడ్ సోర్సెస్ కథనం. నవంబర్ లో 'ఆరెంజ్" విడుదల కానుండగా, 'ఆరెంజ్" ఆడియో విడుదల వేడుకను అత్యంత భారీయెత్తున జరపాలని నిర్మాత నాగబాబు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.