»   »  మెగా,పవర్ బర్త్ డే గిఫ్ట్ లు తయారు చేస్తున్న రామ్ చరణ్ : మీరు ఊహించ లేరు

మెగా,పవర్ బర్త్ డే గిఫ్ట్ లు తయారు చేస్తున్న రామ్ చరణ్ : మీరు ఊహించ లేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్నా.., బాబాయ్ ల ఇద్దరి బర్త్ డే లూ వెంట వెంటనే రానున్నాయి. ఇక ఇద్దరి పుట్టిన రోజులకీ ఒక గిఫ్ట్ ఇచ్చేద్దామనుకుంటున్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతం లో బ్రూస్లీ టైమె లో బాబాయ్ పుట్టిన రోజుకు తీజర్ ని గిఫ్ట్ గా ఇచ్చిన రాం... ఈసారి నాన్నకి కూడా ఇలాంటి బహుమతే సిద్దం చేస్తున్నాడట.

చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో "ధృవ" గా రాబోతున్నాడన్న సంగతి తెలుసుకదా. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మెగాస్టార్ బర్త్‌డే గిప్ట్‌గా ఇచ్చేందుకు చరణ్ సిద్ధం చేస్తున్నాడట. తమిళంలో ఘన విజయం సాధించిన "తని ఒరువన్కి" రీమేక్‌‌‌గా ఈ చిత్రం రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Charan's Movie First Look On Chiru's Birthday

రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. అలాగే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి ట్రైలర్ కాకుండా ఏకంగా ఈ చిత్ర పాటలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ బాబాయ్ భారీ గిఫ్ట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తారని సమాచారం.

ఇటీవలే కశ్మీర్‌‌లో షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదారబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో చరణ్‌ సరసన రకుల్ ప్రీత్‌సింగ్ జోడీకట్టగా...నవదీప్, అరవింద్ స్వామి, పోసాని కృష్ణమురళి కీలకపాత్ర పోషిస్తున్నారు.

English summary
Ram Charan's father and megastar Chiranjeevi celebrates his birthday on 22nd August and on that day the first poster..,30 second teaser of his New Move "Dhruva" will also be released, and on september2 babay pawan kalyan's birth day Audio will be Launched
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu