For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చక్రి మరణానికి కారణం అదే.. దారుణంగా ఆర్థిక పరిస్థితి.. సోదరుడు మహిత్

  By Rajababu
  |

  అతి సామాన్యుడిగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన చక్రి మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు. ఉన్నతస్థాయిలో కొనసాగుతుండగానే చక్రి అకాల మరణం చెందాడు. చక్రి మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబం అనేక సమస్యల్లో కూరుకుపోయంది. ఈ నేపథ్యంలో చక్రి మరణం, ఆయన జీవితం గురించి ఆయన సోదరుడు మహిత్ నారాయణ్ ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహిత్ నారాయణ్ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

   పూరీ జగన్నాథ్ గాడ్ ఫాదర్

  పూరీ జగన్నాథ్ గాడ్ ఫాదర్

  మా కుటుంబానికి దర్శకుడు పూరి జగన్నాథ్ మాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు. ఎలాంటి పేరు లేని అన్నయ్యను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశాడు. ఇండస్ట్రీలో మేము ఉన్నామంటే పూరి జగన్నాథ్ కారణం. పూరీ జగన్నాథ్ లేకపోతే మేము ఇలా ఉండేవాళ్లం కాదు.

   ఇంటికి పూరి పేరు

  ఇంటికి పూరి పేరు

  పూరీ జగన్నాథ్ ఇచ్చిన సహకారాన్ని అన్నయ్య ఎప్పుడు మరువలేదు. ఎప్పుడు పూరికి రుణపడి ఉంటానని చెప్పేవాడు. ఆయన పట్ల ఉన్న ఆరాధ్యంతోనే ఇంటికి పూజ నిలయం అని పేరుపెట్టాడు. పూజ అంటే పూరి జగన్నాథం నిలయం అని అర్థం.

   అన్నయ్య మరణవార్తను ..

  అన్నయ్య మరణవార్తను ..

  అన్నయ్య మరణించింది ఆ రోజు ఉదయం ఐదుగంటల సమయంలో. కానీ దాదాపు ఏడు గంటల ప్రాంతంలో మాకు సమాచారం అందించారు. అప్పుడే అంబులెన్స్‌లో హస్పిటల్‌కు తరలించగా డాక్టర్లు అనుమానాస్పద మరణం అని తేల్చారు.

   చక్రి మరణం గురించి అన్ని రూమర్లే

  చక్రి మరణం గురించి అన్ని రూమర్లే

  చక్రి అన్నయ్య బాగా తాగడం, కంట్రోల్ లేకుండా తినడం వల్ల చనిపోయాడు అనేది తప్పుడు ప్రచారం. కాకపోతే అన్నయ్య భోజన ప్రియుడు. అయితే పని ఒత్తిడి, కుటుంబంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల వల్లే అన్నయ్య ఆరోగ్యం క్షీణించింది. అంతేకాని మీడియాలో వచ్చిన కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదు.

   చక్రి పడిన కష్టాలు

  చక్రి పడిన కష్టాలు

  సినీ పరిశ్రమలో స్థిరపడటానికి చక్రి అన్నయ్య పడిన కష్టం అంతా ఇంతా కాదు. బస్సులో తిరిగేటప్పుడు చినిగిన ప్యాంటులు చిరిగాయి. అయినా వాటితోనే సరిపెట్టుకొన్నాడు. కష్టం విలువ తెలియాలని ఇంటి నుంచి డబ్బుకూడా తీసుకొనే వాడు కాదు. వెబ్‌సైట్లలో రాసే వాళ్లకు ఇదంతా తెలియదు.

   ఆర్థిక పరిస్థితి దారుణం..

  ఆర్థిక పరిస్థితి దారుణం..

  అన్నయ్య చక్రి చనిపోయిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి దిగజారింది. చాలా రోజులపాటు మా చిన్న అక్కయ్య ఇంట్లోనే ఉన్నాం. వాళ్లకు ఓ కుటుంబం ఉంటుంది. వాళ్లకు సొంత జీవితం ఉంటుందనే ఉద్దేశంతో మేము సపరేట్‌గా ఉంటున్నాం.

   వదినతో గొడవల వల్లే

  వదినతో గొడవల వల్లే

  చక్రి చనిపోవడానికి ముందే అన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చాం. వదినకు మాకు మధ్య గొడవలు జరిగాయి. మేము ఉండటమో, లేదా వదిన ఉండటమన్న పరిస్థితి వచ్చింది. అందుకే మేమే అన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చాం.

   చక్రి మరణం తర్వాత చాలా ఇబ్బందులు

  చక్రి మరణం తర్వాత చాలా ఇబ్బందులు

  చక్రి చనిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. మా సొంత ఫ్లాట్‌లో ఉంటున్న వారు కిరాయి ఇవ్వలేదు. మా ఫ్లాట్ మాకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉంది. త్వరలోనే దానికి పరిష్కారం లభించవచ్చు.

   రోడ్డున పడేశామనేది కరెక్ట్ కాదు

  రోడ్డున పడేశామనేది కరెక్ట్ కాదు

  అన్నయ్య చక్రి సంపాధించిన ఆస్తులు మేము లాక్కొన్నామని, మా వదినను రోడ్డున పడేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ మేము ఆస్తులు లాక్కొంటే మేము అద్దె ఇంట్లో ఎలా ఉంటాం. క్యాబ్‌లలో తిరుగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది.

   వెబ్‌సైట్లలో అవాస్తవాలు రాస్తున్నారు..

  వెబ్‌సైట్లలో అవాస్తవాలు రాస్తున్నారు..

  అన్నయ్య స్టూడియోను వాడుకొంటామన్న వార్తలు కూడా అబద్ధమే. కొన్ని వెబ్‌సైట్లు మాపై అవస్తవాలు రాస్తున్నాయి. వారు రాసే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. మా నాన్న సంపాదించిన ఆస్తులతో బతుకుతున్నాం.

   అలాంటి భార్య కావాలి..

  అలాంటి భార్య కావాలి..

  నాకు అందమైన భార్య కావాలనే ఉద్దేశం లేదు. నన్ను అమ్మను బాగా చూసుకొనే భార్య దొరికితే చాలు అనే ఉద్దేశంతో ఉన్నాం. కట్న కానుకల గురించి ఆలోచించడం లేదు. ఇప్పటికే కొన్ని అనాథ శరణాయాలను కూడా సంప్రదించాం. మంచి అమ్మాయి దొరికితే జీవితంలో స్థిరపడాలనే కోరిక ఉంది.

   చక్రి ఉండి ఉంటే.

  చక్రి ఉండి ఉంటే.

  జీవితంలో అన్నయ్యను కోల్పోవడం చాలా లోటు. చక్రి ఉండి ఉంటే మా జీవితం బాగుండేది. ఆయన లేరన్న బాధ మమల్ని వెంటాడుతున్నది. అన్నయ్య లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తాం.

   ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా

  ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా

  అన్నయ్య చనిపోయిన తర్వాత చాలా కష్టాలు వచ్చాయి. వాటిని అధిగమిస్తూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నాం. చాలా మంది సినీ ప్రముఖులను కలిశాను. సంగీత దర్శకుడిగా ఛాన్సులివ్వమని అడుగుతున్నాను.

  English summary
  Music Director Chakri death always be a mystery in film circles. After Chakri's death, his father get into deep troubles. So many contraversies taken place thier life. In this occassion, Chakri's brother Mahith Narayan revealed facts behind his brothers death.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X